ETV Bharat / bharat

ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం - బధిర యువతిపై అత్యాచారం

ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేశాడు ఓ కామాంధుడు. ఈ అమానవీయ ఘటన హరియాణాలో జరిగింది. మరోవైపు బధిర యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది.

rape
హత్యాచారం
author img

By

Published : Oct 28, 2022, 10:27 AM IST

Updated : Oct 28, 2022, 10:37 AM IST

హరియాణా పానీపత్​లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశాడు ఓ వ్యక్తి. నిందితుడ్ని యమునానగర్​కు చెందిన యోగేశ్​గా పోలీసులు గుర్తించారు. కోల్​కతాలోని హౌరా ​రైల్వే స్టేషన్​లో అతడిని అరెస్ట్ చేసి పానీపత్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దీపావళి పండుగ రోజు రాత్రి పానీపత్​లోని కుల్‌దీప్ నగర్‌లోని తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు యోగేశ్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి బాధితురాలి ఇంటి పెరట్లో పడేశాడు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. ఎంతకీ ఆమె ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం తన ఇంటి పెరట్లో చిన్నారి విగతజీవిగా కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు బాలిక కుటుంబ సభ్యులు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ. 50 వేల రూపాయల రివార్డును ప్రకటించారు పోలీసులు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న నిందితుడు యోగేశ్​ ఇంటికి తాళం వేసి ఉండడం పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు.. యోగేశ్​ మొబైల్ కాల్​ డేటాను పరిశీలించారు. యోగేశ్ ఇంటి తలుపులు పగలగొట్టగా అందులో రక్తంతో తడిసిన మహిళ బట్టలు కనిపించాయి.
నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉంది. అంతకుముందు చిన్నారులపై వేధింపులకు పాల్పడినందుకుగానూ నిందితుడు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు.

బధిర యువతిపై..
రాజస్థాన్‌ ఉదయపుర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల బధిర యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను బాధితురాలు గుర్తించింది. వారు కూడా బధిరులే.

అక్టోబరు 21న బాదితురాలు నిరాశ్రయురాలిగా కనిపించడం వల్ల పోలీసులు ఆమెను షెల్టర్​ హోమ్​కు తరలించారు. బుధవారం అర్ధరాత్రి యువతి.. షెల్టర్‌ హోమ్​ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో గోడపై నుంచి పడి ఆమె కాలు విరిగింది. అనంతరం బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం చేసిన వైద్య పరీక్షల్లో బాధితురాలు ఐదు నెలల గర్భిణీ అని తేలిందని హిరాన్​ మగ్రి పోలీసులు తెలిపారు. తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు.. అనువాదకుడి సాయంతో సైగల ద్వారా తెలియజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రేమను నిరాకరించిందని..
కేరళ కొట్టాయంలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో మైనర్​పై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బాధితురాలి చేయిని అడ్డుగా పెట్టడం వల్ల ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలు కారుకాచల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు అఖిల్​(21)ను అరెస్ట్ చేశారు. నిందితుడు.. బాధితురాలిని ఇంతకు ముందు వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గ్రామ పెద్ద హత్య..
ఝార్ఖండ్​ ఖుంటీ జిల్లాలో లోహ్రీలో దారుణం జరిగింది. లోహ్రీ గ్రామ పెద్ద అశోక్ సింగ్​ తన ఇంటికి 500 మీటర్ల దూరంలోని వాటర్ ట్యాంక్ వద్ద విగతజీవిగా కనిపించాడు. బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో అశోక్‌ సింగ్​కు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయటకు వెళ్లాడు. ఎప్పటికి ఇంటికి రాకపోవడం వల్ల అతని కుమారుడు త్రిలోచన్​.. అశోక్​ సింగ్​కు ఫోన్​ చేశాడు. ఎంతకీ తండ్రి ఫోన్ ఎత్తకపోయేసరికి తన బాబాయి సత్యనారాయణతో కలిసి తండ్రిని వెతకడం ప్రారంభించాడు. అలా వెళ్తుండగా ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద అశోక్ సింగ్ రక్తపు మడుగులో కనిపించాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతామని.. త్వరలో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

యాసిడ్ దాడి.. హరియాణా సోనీపత్​లో దారుణం జరిగింది. తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడని ఓ యువకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది ఓ యువతి. ఈ క్రమంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూర్​ విహార్​కు చెందిన బాధితుడు శ్యామ్​కు తల్లిదండ్రులు లేరు. అతడు తన అత్త వాళ్ల ఇంట్లో ఉంటున్నాడు. నిందితురాలు అంజలితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తనను పెళ్లి చేసుకోమని అంజలి.. శ్యామ్​పై ఒత్తిడి తెచ్చేది. బాధితురాలు తన తల్లితో కలిసి శ్యామ్ ఇంటికి వెళ్లి చేసుకోమని అడిగింది. దీనికి శ్యామ్ అత్త ససేమిరా అనడం వల్ల కోపం పెంచుకుంది అనిత. శ్యామ్ పాలు తెచ్చేందుకు దుకాణానికి వెళ్తుండగా అతడిపై యాసిడ్ దాడి చేసింది.

మూకదాడి..
బిహార్​ సమస్తిపుర్​లో దారుణం జరిగింది. బైక్​పై వస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నారు ముగ్గురు దొంగలు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురు దొంగలపై మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దొంగలు తమపై కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. ముగ్గురు దొంగలు వైశాలిలోని నయాగంజ్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి: ఇంటి పని చేయాలని భార్యకు చెప్పడం క్రూరత్వం కాదు: హైకోర్టు

బిడ్డను ఒంటికి కట్టుకుని.. ఆటో నడుపుతూ..'ఆమె' బతుకు పోరాటం

Last Updated : Oct 28, 2022, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.