ETV Bharat / bharat

ముగ్గురు బాలికలపై రేప్​​.. తెలిసినవారేనని నమ్మి వెళ్తే... - బాలికపై స్నేహితుల అత్యాచారం

Gang rape victim: బాలికను హోటల్​కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె ఇద్దరు స్నేహితులు. మాట్లాడాలని చెప్పి నమ్మించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో జరిగింది. ఫిరోజాబాద్​లో ఓ బాలికను కారు డ్రైవర్ రేప్ చేశాడు. మరోవైపు.. ఓ మహిళను నమ్మి తన ఇంటికి వెళ్లిన ఓ 16 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేసి ఫోన్​లో రికార్డు చేసి వేధింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన హరియాణా జింద్​ జిల్లాలో జరిగింది.

Girl gang-raped
బాలికపై స్నేహితుల అత్యాచారం
author img

By

Published : Jan 10, 2022, 1:49 PM IST

Gang rape victim: స్నేహితులే కదా అని నమ్మి వారితో వెళ్లటమే ఆ బాలిక చేసిన పొరపాటు. మాట్లాడదామని హోటల్​కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె ఇద్దరు స్నేహితులు. ఈ దారుణ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని తాజ్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ హోటల్​లో ఆదివారం రాత్రి జరిగింది.

నిందితుల చెర నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన బాధితురాలు.. యూపీ పోలీస్​ అత్యవసర హెల్ప్​లైన్​ నంబర్​ 112కు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై జరిగిన అఘాయిత్యంపై సమాచారం అందించినట్లు చెప్పారు. 'నిందితుల్లో ఒకరు ఆమెకు బాగా తెలుసు. చాలా సార్లు కలిశాడు. మాట్లాడాలని చెప్పి కారులో హోటల్​కు తీసుకెళ్లాడు. అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు' అని బాధితురాలు వివరించినట్లు తెలిపారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత హోటల్​ నుంచి పారిపోయారని, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

12 ఏళ్ల బాలికపై కారు డ్రైవర్​ అత్యాచారం

ట్రాన్స్​జెండర్​తో కలిసి కిన్నర్​ సమ్మేళనానికి వచ్చిన 12 ఏళ్ల బాలికపై వారి కారు డ్రైవర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లోని శికోహబాద్​ ప్రాంతంలో ఈనెల 8వ తేదీన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు డ్రైవర్​ను అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.

టీనేజర్​పై గ్యాంగ్​ రేప్​.. డబ్బుల కోసం వేధింపులు..

Gang rape: 16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, ఆ దుశ్చర్యను వీడియో తీయటమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. హరియాణా జింద్​ జిల్లాలో గత ఏడాది ఆగస్టు 5న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘర్హీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 11వ తరగతి విద్యార్థిని తమ కాలనీలో అద్దెకు ఉంటున్న ఓ మహిళను కలిసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. వీడియో వైరల్​​ చేస్తామంటూ డబ్బులు డిమాండ్​ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లి.

పోక్సో సహా ఇతర చట్టాల కింద మహిళతో పాటు మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: మైనర్​పై టీచర్​ అత్యాచారం.. సోదరిని పెళ్లి చేసుకున్నాడని స్నేహితుడి హత్య​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.