Girl Fell From Balcony: నాలుగేళ్ల చిన్నారిని కాపాడే క్రమంలో ఆమె తండ్రి కూడా మరిణించిన విషాద ఘటన దిల్లీలో జరిగింది. చిన్నారి బాల్కనీలో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
ఇదీ జరిగింది..
ఈశాన్య దిల్లీలోని దయాల్పుర్లో ప్రాంతంలో అసదుల్లా చిన్న కూతురు (4) తమ ఇంటి బాల్కనీలో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఆమె సోదరి తనను కాపాడటానికి ప్రయత్నించి అదుపు తప్పి మధ్యలో ఎక్కడో చిక్కుకుపోయింది.
ఈ క్రమంలోనే కూతుళ్ల జాడ కోసం వచ్చిన అసదుల్లా.. కిందకు చూస్తూ బాల్కనీలోంచి పడిపోయాడు. చిన్నారి కిందపడిపోగానే.. స్థానికులు బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించారు.
"బాల్కనీ నుంచి చూసే క్రమంలో గోడకు దూరంగా ఉండాలని చెప్పినా.. అసదుల్లా వినిపించుకోలేదు. దీంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించాము. చివరకు నామీదే పడ్డాడు. నాకూ కొన్ని గాయాలయ్యాయి." అని ఓ స్థానికుడు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రేమించట్లేదని యువతిని సుత్తితో కొట్టి హత్య.. ఆపై గొంతు కోసుకొని..!