ETV Bharat / bharat

షవర్మా తిని విద్యార్థిని మృతి.. ఆస్పత్రిలో మరో 18 మంది - బాలిక మృతి

Food poisoning: ట్యూషన్​ కేంద్రానికి సమీపంలో ఉన్న జ్యూస్​ షాప్​లో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్​ జిల్లాలో ఆదివారం జరిగింది.

food poisoning
food poisoning
author img

By

Published : May 1, 2022, 8:08 PM IST

food poisoning: కలుషిత ఆహారం తిని ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిన ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్​ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ జ్యూస్​ షాప్​లో షవర్మా తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఆ షాపు ట్యూషన్​ కేంద్రానికి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.

food poisoning
ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని

కరివళ్లూర్​కు చెందిన దేవానంద (16).. కన్హాన్ ​గడ్​లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. జ్యూస్​​ షాప్​పై కేసు నమోదు చేసి సీజ్​ చేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరిన మరో 18 మంది విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.

"ఇంకా చాలా మంది అస్వస్థతకు గురై ఉంటారని భావిస్తున్నాం. చెరువతుర్​ పీహెచ్​సీ, నీలేశ్వరమ్​ తాలూక ఆసుపత్రికి సమీపంలోని వైద్యులు, మెడికల్​ ఇన్​స్టిట్యూట్స్​కు సమాచారం అందించాం. స్వల్ప లక్షణాలు ఉన్న వారికి అక్కడే చికిత్స అందించటం సహా తీవ్రంగా అస్వస్థతకు గురైన వారిని జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నాం. "

- ఏవీ రామ్​దాస్​, జిల్లా వైద్యాధికారి.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు రాష్ట్ర మంత్రి ఎంవీ గోవిందన్​. హోటళ్లలో నాణ్యమైన ఆహారం అందించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

food poisoning
ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి

ఇదీ చూడండి: బస్టాండ్​లోనే విద్యార్థినుల ఫైట్​.. జుట్టు పట్టుకుని పిడిగుద్దులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.