మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. స్థానికంగా ఉండే హై ఓల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీనిని చూసిన ఓ వ్యక్తి ఓంథీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరాను నిలిపేశారు. యువతిని దింపే ప్రయత్నం చేశారు.
చాలాసేపు ప్రయత్నించగా.. చివరకు ఆమెను కిందకు దించారు. యువతికి తీవ్రంగా గాయాలు కావడం కారణంగా స్థానికంగా ఉండే విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. యువతి తన సోదరునితో కలిసి షాహ్పురా దిండోరీలో అద్దె ఇంట్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆమె సోదరుడిని విచారించగా.. యువతి మానసిక స్థితి బాగోలేదని చెప్పినట్లు వివరించారు. అందుకే హై ఓల్టేజ్ ట్రాన్స్ఫార్మ్ను ఎక్కి.. ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు.
హై ఓల్టేజ్ వైర్లను పట్టుకోవడానికి యువతి పదేపేదే తాకేందుకు ప్రయత్నించిందని సాక్షులు చెప్పారు. దీంతో ఆమె పలుసార్లు కరెంట్ షాక్కు గురైనట్లు పేర్కొన్నారు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సత్వరమే స్పందించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడిందని అన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ రిపోర్టు లేక పడక దొరకలేదు.. ప్రాణం ఆగలేదు..