ETV Bharat / bharat

మళ్లీ సొంత గూటికి గులాం నబీ ఆజాద్​!.. నిజమేనా? - bharath Jodo Yatra in Jammu and Kashmir

గులాం నబీ ఆజాద్​ తిరిగి కాంగ్రెస్​ పార్టీలో మళ్లీ చేరే అవకాశాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వెలువడ్డాయి. వచ్చే నెలలో జమ్ముకశ్మీర్​లో జరిగే భారత్​ జోడో యాత్రలో ఆయన పాల్గొని తిరిగి హస్తం పార్టీలో చేరుతారని కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై గులాం నబీ ఆజాద్ స్పందించారు.

ghulam nabi azad
గులాం నబీ ఆజాద్​
author img

By

Published : Dec 30, 2022, 9:21 PM IST

Updated : Dec 31, 2022, 6:35 AM IST

Ghulam Nabi Azad Congress: కాంగ్రెస్​ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ స్థాపించిన జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్​ నాయకులు గులాం నబీ ఆజాద్​ మళ్లీ యూటర్న్​ తీసుకోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. వచ్చే నెలలో జమ్ముకశ్మీర్​కు చేరనుంది. ఈ నేపథ్యంలో ఆజాద్.. జోడో యాత్రలో పాల్గొని కాంగ్రెస్​లో చేరుతారని పలు కథనాలు వచ్చాయి. సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్.. ఆజాద్‌ను యాత్రలో భాగం కావాలని ఆహ్వానించినట్లు సమాచారం.

అయితే వీటన్నింటిని ఆజాద్​ కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్​ పార్టీలోకి తిరిగి వెళ్లట్లేదని స్పష్టం చేశారు. "నేను ఏ కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడలేదు.. నన్ను ఎవరూ పిలవలేదు. మీడియాలో ఇలాంటి కథనాలు ఎందుకు వచ్చాయో తెలియదు. వాటిని చూస్తే ఆశ్చర్యమేసింది. నా పార్టీ క్యాడర్‌లో అనిశ్చితి సృష్టించి.. వారిని నిరుత్సాహపరిచేందుకే కాంగ్రెస్ నేతలు ఈ ప్రయత్నాలు చేశారు" అని తెలిపారు. వచ్చే నెలలో జమ్ముకశ్మీర్​లో జరిగే భారత్​ జోడోయాత్రలో పాల్గొంటారా? అన్న ప్రశ్నకు.. అందుకు ఎలాంటి ప్రణాళిక లేదని, తనకు చాలా పనులు ఉన్నాయని బదులిచ్చారు.

73 ఏళ్ల గులాం నబీ ఆజాద్​ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్​లో ఉన్నారు. జమ్ముకశ్మీర్​ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోక్​సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పలు పర్యాయాలు పనిచేశారు. ఆగస్టు 26న హస్తం పార్టీతో బంధాన్ని తెంచుకున్నారు. అనంతరం సొంతంగా డెమోక్రటిక్ ఆజాద్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో రాహుల్​ గాంధీపై తీవ్ర విమర్శలు సైతం చేశారు ఆజాద్.

ఇవీ చదవండి:

Last Updated : Dec 31, 2022, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.