ETV Bharat / bharat

స్కూల్​లో దెయ్యం!.. ఐదుగురు టీచర్లు మృతి.. బడి మానేసిన పిల్లలు - పాఠశాలలో దెయ్యం భయం

ఛత్తీస్​గఢ్​లోని ఓ స్కూల్​లో​ దెయ్యం ఉందనే మూఢనమ్మకంతో.. బడి మూతపడింది. పిల్లలు సైతం అటుగా వెళ్లడమే మానేశారు. గత రెండేళ్లలో ఐదుగురు ఉపాధ్యాయులు చనిపోవడమే దీనికి కారణం. మనేంద్రగర్-చిమ్​రి-భరత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ghost-fear-in-school-students-away-from-school-in-chhattisgarh
స్కూల్​లో దెయ్యం
author img

By

Published : Apr 29, 2023, 10:52 PM IST

Updated : Apr 29, 2023, 11:00 PM IST

స్కూల్​లో దెయ్యం ఉందని పిల్లలు బడి​ మానేశారు. కొంత కాలంగా స్కూల్​ వైపు చూడటమే ఆపేశారు. ఉన్న ఒక్క టీచర్​ సైతం సెలవుల్లో ఉన్నారు. దీంతో ఆ స్కూల్​ మూతపడింది. స్కూల్​లో ఐదుగురు టీచర్లు దెయ్యం కారణంగానే చనిపోయారని గ్రామస్థులు మూఢ నమ్మకంతో ఉన్నారు. ఛత్తీస్​గఢ్​లోని మనేంద్రగర్-చిమ్​రి-భరత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

సావ్లా గ్రామ పంచాయితీలోని బాసెల్‌పుర్‌లో ఓ ప్రభుత్వ ప్రీ-సెకండరీ పాఠశాల ఉంది. గత రెండేళ్లగా స్కూల్​లో పనిచేసిన ఐదుగురు ఉపాధ్యాయులు.. అనారోగ్య కారణాలతో చనిపోయారు. స్కూల్​లో పనిచేసిన శ్యాంబిహారి అనే టీచర్​ ఆకస్మికంగా మృతి చెందారు. మరో టీచర్​ వీరేంద్ర సింగ్.. బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారు. చంద్రప్రకాష్ పైక్రా ఇంట్లో నిద్రిస్తూనే మరణించారు. స్కూల్ నుంచి రిటైరైన ప్రిన్సిపాల్ పాఠక్ ధరమ్ సాయి కూడా వివిధ కారణాలతో మృతిచెందారు. మరో ఉపాధ్యాయుడు సైతం అనుమానాస్పద రీతిలో చనిపోయారు. దీంతో ఆ ఊరి ప్రజలంతా స్కూల్​లో దెయ్యం ఉందని నమ్మారు. దీంతో పిల్లలను స్కూల్​కు పంపించడమే మానేశారు.

"2023 ఏప్రిల్ 11న టీచర్ శ్యాంబిహారి మరణించారు. అప్పుడు నేను సెలవుల్లో ఉన్నాను. దీంతో స్కూల్ మూతపడింది. గ్రామస్థుల్లో దెయ్యాల వదంతులను తొలగించేందుకు ప్రయత్నిస్తాం." అని టీచర్​ మోనితా వర్మ తెలిపారు. గత 12 ఏళ్లుగా స్కూల్​లో ప్యూన్​గా పనిచేస్తున్న రాజేష్​.. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజల్లో వ్యాపించిన ఈ మూఢనమ్మకాన్ని తొలగించేందుకు కృషి చేస్తున్నామని రాజేశ్​ తెలిపారు.

ఈ స్కూల్​ పనిచేసిన చాలా మంది ఉపాధ్యాయులు చనిపోయారని బ్లాక్​ ఎడుకేషన్​ ఆఫీసర్​ జితేంద్ర గుప్తా తెలిపారు. ఉన్న ఒక్క టీచర్​ సెలవుల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. దెయ్యం పుకార్లతో ప్రజల్లో భయం పెరిగిందన్న ఆయన.. దాన్ని తొలగించేదుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

దెయ్యం భయంతో ఆ ఊరు ఖాళీ!
కొంత కాలం క్రితం ఒడిశాలోని నయాగడ్‌ జిల్లా రాణాపూర్ బ్లాక్ పరిధి గుండురుబడి గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఊర్లో దెయ్యం ఉందనే మూఢనమ్మకంతో.. ఒక్కొక్కరుగా ఇళ్లు వాకిలి వదిలి గ్రామం వెలుపలకు చేరారు. నాలుగేళ్లలో ఐదుగురు మగవాళ్లు ఏ కారణం చనిపోయారని వారు చెబుతున్నారు. తాంత్రికులను సంప్రదించగా ఊరొదిలితే కానీ ప్రాణాలు దక్కవంటూ.. వారు మరింతగా గ్రామస్థులను భయపెట్టారు. ఇక చేసేదేమీ లేక.. ఊరు వదిలి పోయారు. ఊరు వదిలిపోలేని వాళ్లు సూర్యాస్తమయం అయ్యిందంటే దెయ్యం భయంతో గడప దాటి బయటకు రావడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Apr 29, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.