ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్‌లోని కొత్వాలి ప్రాంతంలో రాళ్ల దాడి ఘటన కలకలం సృష్టిచింది. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఉదంతంలో ఇరువర్గాలకు చెందిన కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం జరిగిన ఈ వివాదానికి కారణం తెలియాల్సి ఉంది.
మరోవైపు.. గ్రామస్థులు పరస్పరం రాళ్లు రువ్వుకుంటున వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
"లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని రషీద్ అలీ గేట్ సమీపంలో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడినట్టు సమాచారం అందింది. కాసేపటికే పరిస్థితి అదుపు తప్పినట్లు తెలిసింది. అంతకముందు నుంచే రాళ్లదాడి జరుగినట్టు సమాచారం. ఘటనలో తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు చెప్పారు."
---పోలీసులు
భయంలో ప్రజలు..
'ప్రజలు భయపడుతున్నారు. వారిని ఇళ్లలోనే ఉండాల్సిందిగా కోరాం. తీవ్రంగా ప్రయత్నించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం,' అని పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ దేహత్ ఇరాజ్ రాజా తెలిపారు. 'నిందితులెవరూ తప్పించుకోలేరని,' వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో కొందరు వ్యక్తులు గాయపడ్డారని.. పలు ఇళ్లు, వస్తువులు ధ్వంసమయ్యాయని వివరించారు.
ఇవీ చదవండి: