ETV Bharat / bharat

రూ. 90కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఆ మహిళలే సూత్రధారులు - దిల్లీలో డ్రగ్స్ పట్టివేత వార్తలు

రూ.90 కోట్ల విలువైన హెరాయిన్‌తో ఉగాండా నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కెన్యాలోని నైరోబీ నుంచి అబుదాబి మీదుగా భారత్‌కు వచ్చారని తెలిపారు.

Heroin
సూట్​కేసు అడుగు భాగంలో డ్రగ్స్
author img

By

Published : Nov 13, 2021, 10:56 PM IST

దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్​లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఎయిర్‌పోర్ట్​లో కస్టమ్స్ తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను విచారించారు పోలీసులు. వారు నోరు మెదపకపోయేసరికి.. శునకాల ద్వారా నిర్వహించిన తనిఖీల్లో పెద్దఎత్తున హెరాయిన్ గుర్తించారు. సూట్​కేసు అడుగు భాగంలో దాచి.. ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద 12కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకోగా.. దీని విలువ దాదాపు రూ.90 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు.

Heroin
పట్టుబడిన డ్రగ్స్
Heroin
దిల్లీలో డ్రగ్స్ గుట్టు రట్టు

ఉగాండా నుంచి మెడికల్ వీసాపై భారత్​కు వీరు వచ్చారు. రిద్దరూ కెన్యాలోని నైరోబీ నుంచి అబుదాబి మీదుగా భారత్‌కు వచ్చారు. హెరాయిన్​ను దిల్లీకి చేరవేయగానే డబ్బు అందుతుందని విచారణలో ఈ మహిళలు వెల్లడించారు. నిందితులపై నార్కొటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు అధికారులు. పట్టుబడిన హెరాయిన్​ను ఎవరు ఆర్డర్ చేశారు? ఎవరికి డెలివరీ చేయబోతున్నారు? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Heroin
సూట్​కేసు అడుగు భాగంలో డ్రగ్స్
Heroin
సూట్​కేసు అడుగు భాగంలో డ్రగ్స్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.