మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నవంబర్ 13న జరిగిన ఎన్‌కౌంటర్‌కు, నక్సల్స్ కీలక నేత మిలింద్ తేల్‌తుంబ్డే మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈమేరకు సీపీఐ(మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్.. ప్రెస్ రిలీజ్లో లేఖను విడుదల చేశారు. మిలింద్ తేల్‌తుంబ్డే ఉద్యమానికి చేసిన సేవలను అందులో పొందుపరిచారు.
నవంబరు 27న బంద్..
ఎన్కౌంటర్లో మృతిచెందిన నక్సల్స్‌కు సంఘీభావంగా ఈనెల 27న ఆరు రాష్ట్రాల్లో బంద్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
దద్దరిల్లిన అడవులు..
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఉండే ఓ గ్రామంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు.
వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు గోయల్ తెలిపారు.
ఇదీ చూడండి: 'తేల్‌తుంబ్డే మరణం.. మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ'