ETV Bharat / bharat

సాంకేతిక సమస్యతో​ విమానం అత్యవసర ల్యాండింగ్​

author img

By

Published : May 6, 2021, 9:57 PM IST

Updated : May 7, 2021, 1:14 AM IST

ఐదుగురు ప్రయాణికులతో నాగ్​పుర్​ నుంచి ముంబయి వెళ్తున్న ఓ చార్టర్డ్​ విమానం.. ముంబయి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ అయింది. టేకాఫ్​ అయ్యే క్రమంలో విమానం చక్రంలో సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

chartered plane
సాంకేతిక సమస్యతో​ విమానం అత్యవసర ల్యాండింగ్​

ఓ వైద్యుడు, ఓ రోగి సహా ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న ఓ ఛార్టర్డ్​ విమానం.. ముంబయి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ అయింది. విమానం ల్యాండింగ్​ సమయంలో మంటలు చెలరేగకుండా ఉండేందుకు రన్​వేపై విమానాశ్రయ అధికారులు నురగను ఏర్పాటు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. నాగ్​పుర్​ నుంచి ముంబయికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు.

నాగ్​పుర్​ నుంచి విమానం టేకాఫ్​ అయ్యే క్రమంలో విమాన చక్రంలో సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో విమానం ల్యాండ్​ అయిన ఫొటోలు, వీడియోలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే.. దీనిపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ విమానం.. గురుగ్రామ్​కు చెందిన జెట్​ సర్వీస్​ ఏవియేషన్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు చెందినదని ఓ అధికారి తెలిపారు.

అయితే.. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారని విమానాశ్రయం ఓ ప్రకటన విడుదల చేసింది. ముందు జాగ్రత్త చర్యగా సహాయక చర్యల కోసం సిబ్బందిని మోహరించినట్లు చెప్పింది.

ఇదీ చూడండి: ఆక్సిజన్​ సరఫరాపై మోదీకి కేజ్రీవాల్​ కృతజ్ఞతలు​

Last Updated : May 7, 2021, 1:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.