Girl Suicide Due to Hair Fall: కర్ణాటకలోని మైసూర్లో ఘోరం జరిగింది. జుట్టు రాలిపోతుందని మనస్తాపంతో ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని 21 ఏళ్ల కావ్యశ్రీగా గుర్తించారు. రాఘవేంద్ర ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఆమె కొద్దిరోజులుగా హేర్ ఫాల్ సమస్యతో బాధపడుతోంది. ఎన్నో చికిత్సలు తీసుకుంది. అయినా ఫలితం లేకపోయింది. క్రమక్రమంగా జుట్టు మొత్తం ఊడిపోయింది. దీంతో.. తీవ్ర కుంగుబాటుకు లోనైన యువతి.. ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న నజారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: Anemia Hair Fall: ఇవి పాటిస్తే మీ జుట్టు రాలదు!
నూనె రాస్తే జుట్టు రాలదా? వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?