ETV Bharat / bharat

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ అమరులకు ఫ్రాన్స్ సంతాపం - ఫ్రాన్స్

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాపం తెలిపింది ఫ్రాన్స్. తీవ్రవాద వ్యతిరేక పోరులో భారత్​కు దన్నుగా నిలుస్తామని భరోసా ఇచ్చింది.

French envoy condoles death of soldiers killed in Naxal attack in Chhattisgarh
ఛత్తీస్​గఢ్​లో జవాన్ల మృతి పట్ల ఫ్రాన్స్ సంతాపం
author img

By

Published : Apr 5, 2021, 5:31 AM IST

Updated : Apr 5, 2021, 9:16 AM IST

ఛత్తీస్​గఢ్​​ అడువుల్లో నక్సల్​ దాడిలో అమరులైన జవాన్లకు సంతాపం ప్రకటించింది ఫ్రాన్స్. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్​కు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. ఈ మేరకు భారత్​లో ఫ్రాన్స్​ రాయబారి ఇమ్మాన్యూయేల్ లీనైన్ ట్విట్టర్​లో ఆవేదన వ్యక్తంచేశారు.

"ఛత్తీస్​గఢ్​లో అమరులైన జవాన్ల పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాం. బాధితులు, క్షతగాత్రుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని అరికట్టే పోరులో భారత్​కు ఫ్రాన్స్​ అండగా ఉంటుంది."

- ఇమ్మాన్యూయేల్ లీనైన్, భారత్​కు ఫ్రాన్స్​ రాయబారి

బీజాపుర్​-సుఖ్మా జిల్లా సరిహద్దుల్లో జరిగిన మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మంది నక్సల్స్​ జరిపిన ఈ దాడిలో మరో 30కి పైగా సైనికులు గాయాలపాలయ్యారు.

ఇదీ చూడండి: జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి!

Last Updated : Apr 5, 2021, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.