ETV Bharat / bharat

'తాయిలాలతో ప్రజలకే నష్టం- ఉచితాలు సరికాదు'

author img

By

Published : Mar 26, 2021, 7:11 AM IST

ఎన్నికల్లో గెలవడానికి.. అధికారం కోసం ఉచిత పథకాలను ప్రకటించడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ సారి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కనిపించబోదన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిదే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈనాడు-ఈటీవీతో ముచ్చటించిన కేంద్రమంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Free schemes for power are not right: Union Minister Kishan Reddy
'తాయిలాలతో ప్రజలకే నష్టం- ఉచితాలు సరికాదు'

గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈసారి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కనిపించబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తమిళనాడు ఎన్నికల్లో భాజపా బాధ్యులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులు చూసి అన్నాడీఎంకే కూటమికి ప్రజలు ఈసారి విజయాన్ని అందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్లు సర్వేల ద్వారా తెలిసిందన్నారు. చెన్నైలో గురువారం ఆయన 'ఈనాడు-ఈటీవీ' ప్రతినిధితో ముచ్చటించారు.

2019 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు!

2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి ఒక స్థానం మాత్రమే లభించింది. ఆ ఎన్నికలకు కొద్దికాలం ముందు మాత్రమే ముఖ్యమంత్రిగా పళనిస్వామి పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీనివల్ల ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు సమయం అవసరమైంది. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి పళనిస్వామి అభివృద్ధి పనుల ద్వారా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా, ప్రజలకు సత్వరం వైద్యం అందేలా పళనిస్వామి తగిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తున్నారు. నీటి ఎద్దడి సమస్య పరిష్కరించారు. అందరి అంచనాలు తలకిందులు చేసి, పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే-భాజపా మధ్య కుదిరిన పొత్తు వల్ల రెండు పార్టీలూ ప్రయోజనం పొందుతాయి. ప్రచారం ఇప్పటివరకు ప్రాథమిక దశలోనే ఉంది. ఇకపై పుంజుకుంటుంది. ఈ నెల 30న ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు.

శశి ప్రకటన వెనుక మా ప్రమేయం లేదు

జయలలిత నెచ్చలి శశికళ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని చేసిన ప్రకటన వెనుక భాజపా ప్రమేయం ఎంత మాత్రం లేదు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ఇక్కడ ప్రభుత్వం కూలకూడదని, మధ్యంతర ఎన్నికలు రాకూడదనే భావనతో వారికి, అభివృద్ధి పథకాల వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది. అన్నాడీఎంకేను గెలిపించాలని శశికళ నేరుగా చెప్పకున్నా డీఎంకే అధికారంలోకి రాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం వంద సంవత్సరాలు కొనసాగాలన్నారు కదా!

అవసరాల మేరకు పార్టీల నిర్ణయాలు

పౌరసత్వ సవరణ చట్టానికి మొదట అన్నాడీఎంకే మద్దతు పలికింది. ఇప్పుడు ఆ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలపై కానీ, పార్టీలపై కానీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండదు. అవసరాల మేరకు పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి. వాటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. అవసరమైతే ఎన్డీఏ భాగస్వామిగా అన్నాడీఎంకేకు నచ్చచెప్పడానికి యత్నిస్తాం.

ఉమ్మడి జాబితా నుంచి విద్యారంగాన్ని తప్పించడం సులువు కాదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా నుంచి విద్యారంగాన్ని తీసేసి, రాష్ట్ర పరిధిలో ఉంచాలని అన్నాడీఎంకే, డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నాయి. మధ్యాహ్న భోజనం పథకం, పిల్లలకు దుస్తుల పంపిణీ, పాఠశాల భవనాల నిర్మాణాల పనులకు ఉమ్మడి జాబితా అనుసరించి కేంద్రం నిధులు అందజేస్తోంది. ఈ నిధులతోనే విద్యారంగాన్ని అభివృద్ధి చేసే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జాబితా నుంచి విద్యారంగాన్ని తప్పించాలంటే రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాలు, మేధావులు కలిసి, చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.

ఉచిత తాయిలాలు మంచిది కాదు!

అధికారం కోసం ఎన్నికల సమయంలో ఉచిత తాయిలాలు ప్రకటించే ధోరణిలో మార్పు రావాలి. ఎన్నికల కోసం ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేనే కాదు.. మా పార్టీ కూడా! ఇలాంటి విషయాల్లో ఈసీ కీలక పాత్ర పోషించాలి. మౌలిక వసతులు, విద్య, గ్రామాలకు మంచి రోడ్లు, మంచి పాఠశాల భవనాలు, పిల్లలకు కావాల్సిన ప్రోత్సాహకాలు, గ్రామాల్లో మంచి ఆసుపత్రులు, వ్యవసాయానికి సంబంధించిన ప్రోత్సాహకాలు, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేలా హామీలు ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. బడ్జెట్లో 50% నిధులను పలు రాష్ట్రాలు ఉచిత కార్యక్రమాలకు కేటాయిస్తున్నాయి. దీనివల్ల ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అప్పుల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.

ఇదీ చూడండి: బంగాల్​, అసోంలో తొలి దశ ప్రచారం సమాప్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.