ETV Bharat / bharat

పేదలకు కేంద్రం గుడ్​న్యూస్​- మరో ఐదేళ్లపాటు రేషన్ ఫ్రీ - దేశ ప్రజలకు మరో ఐదేళ్లు ఉచిత రేషన్

Free Ration Scheme Extended : దేశంలోని పేద ప్రజలకు శుభవార్త. కేంద్రం ప్రభుత్వం.. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పెంచింది. అలాగే డ్వాక్రా గ్రూపులకు వ్యవసాయ డ్రోన్​లను అందించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ కేంద్ర కేబినెట్ నిర్ణయాలను తెలిపారు.

free ration scheme extended
free ration scheme extended
author img

By PTI

Published : Nov 29, 2023, 1:35 PM IST

Updated : Nov 29, 2023, 2:26 PM IST

Free Ration Scheme Extended : కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు గుడ్​న్యూస్ చెప్పింది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు వచ్చే ఐదేళ్లలో రూ.11.8లక్షల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.

  • VIDEO | "The Antyodaya Yojana will be extended for next the five years from January 1, 2024. The families identified under this scheme will be provided 5kg foodgrains per month," says Union minister @ianuragthakur addressing Cabinet briefing. pic.twitter.com/rqx7vtEwyq

    — Press Trust of India (@PTI_News) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను కేంద్రం.. దేశంలో కొవిడ్ విజృంభించిన సమయంలో పేదలకు అండగా ఉండేందుకు 2020లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులకు ఒకరికి 5కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం 2023 డిసెంబరు 31తో గడువు ముగియగా.. కేంద్ర కేబినెట్​ తాజా నిర్ణయంతో మరో ఐదేళ్లపాటు కొనసాగనుంది.

మరోవైపు.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను రాబడిని పంచుకోవడంపై నిర్ణయం తీసుకునే 16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అనురాగ్ ఠాకూర్​ తెలిపారు. 16వ ఆర్థిక సంఘం తన నివేదికను 2025 అక్టోబర్ నాటికి సమర్పిస్తుందని.. 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి సిఫార్సులు చెల్లుబాటు అవుతాయని చెప్పారు.

  • #WATCH | Union Minister Anurag Thakur says, "The next decision is regarding the 16th Finance Commission. The Union Cabinet has given its approval on the Terms of Reference of the 16th Finance Commission...On the basis of the recommendations of the Working Group, the Terms of… pic.twitter.com/5n89nIxtRq

    — ANI (@ANI) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు.. డ్వాక్రా గ్రూపులకు వ్యవసాయ డ్రోన్‌లను అందించే పథకానికి కేంద్రం మంత్రివర్గం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. 15వేల డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు అందించి.. వారికి శిక్షణ ఇవ్వనుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఈ డ్రోన్​లను డ్వాక్రా గ్రూపులు అద్దెకు ఇవ్వనున్నాయి. 2023-24 నుంచి 2025-2026 మధ్యకాలంలో ఎంపిక చేసిన 15,000 డ్వాక్రా గ్రూపులకు డ్రోన్​లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

  • #WATCH | Union cabinet approved Central Sector Scheme for providing Drones to the Women's Self Help Groups. Drones to be provided to 15,000 selected Women's SHGs during 2023-24 to 2025-2026 for providing rental services to farmers for agricultural uses

    Union Minister Anurag… pic.twitter.com/BIAAiw7KdI

ప్రధాని మోదీ భావోద్వేగం..
కేంద్ర కేబినెట్ సమావేశంలో ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ గురించి చర్చకు వచ్చిందని అనురాగ్ ఠాకుర్ తెలిపారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నా కూడా.. సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ ధామీతో రోజుకు రెండు సార్లు మాట్లాడేవారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఠాకుర్​ సమాధానమిచ్చారు.

కూలీల ఉద్విగ్న క్షణాలు- బయటకు రాగానే 'భారత్​ మాతా కీ జై' అంటూ నినాదాలు, కార్మికులకు మోదీ ఫోన్​ కాల్​

56 ఏళ్ల వయసులో పట్టువదలని విక్రమార్కుడు- 23ప్రయత్నాల తర్వాత సెక్యూరిటీ గార్డ్ డబుల్ పీజీ

Last Updated : Nov 29, 2023, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.