కర్ణాటకలో దారుణం జరిగింది. సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున జలపాతంలో జారిపడి నలుగురు యువతులు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
బెళగావి జిల్లాకు చెందిన 40 మంది అమ్మాయిలు.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కితవాడ జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు. పర్యటనలో ఐదుగురు యువతులు సెల్ఫీ తీసుకుంటూ వాటర్‌పాల్స్‌లో జారిపడ్డారు. వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్రంగా గాయలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు అసియా ముజావర్(17), కుద్షియా హసం పటేల్(20), రుక్కాషర్ భిస్తీ(20), తస్మియా(20)గా గుర్తించారు. విషయం తెసుకున్న మృతుల కుటుంబసభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బెళగావి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బుల్లెట్ తగిలి.. మృతి చెందిన బౌన్సర్
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకలో ప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన వేడుకల్లో భాజపా నేత గన్ ఫైరింగ్ చేయగా.. ఆ బుల్లెట్లు తగిలి ఓ బౌన్సర్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఓ పెళ్లి వేడుకల్లో భాగంగా.. గన్ ఫైరింగ్ చేయగా అది తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు.
రామ్‌జీ గుప్తా అనే భాజపా కార్యకర్త వివాహ వేడుకల్లో డబుల్ బ్యారెల్ గన్‌తో కాల్పులు జరిపాడు. పొరపాటున ఆ బుల్లెట్లు మీర్పుర్కు చెందిన మహ్మద్ సాదిక్ అనే బౌన్సర్.. తల, మెడ, ఛాతీ భాగాల్లో తగిలాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ఓ జిమ్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. నిందితుడు రామ్‌జీని అరెస్ట్ చేసినట్లు డీసీపీ శివాజీ వెల్లడించారు.