Four Years Girl Died Due to Local Made Gun Firing: దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు జరుగుతుంటే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. అభం శుభం తెలియని చిన్నారిని ఓ నాటు తుపాకీ తూటా బలి తీసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన ఆ బాలికను తూటా చంపేసి.. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక తిరిగి రాదనే విషయంతో ఆ తల్లిదండ్రుల వేదన అరణ్య రోదనగా మారింది. ఆ తల్లిదండ్రుల దుఃఖం చూసి స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్లి మండపంలో సరదాగా గన్ ఫైర్.. పోలీస్ కేస్తో వధువు పరార్.. దొరికితే రెండేళ్లు జైలు శిక్ష!
Gun Firing in Kakinada: తుని మండలం వెలమ కొత్తూరులో నాటు తుపాకీ తూటా తగిలి నాలుగు సంవత్సరాలు చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ.. తోటి స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమీప ప్రాంతంలో కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందుల్ని కాలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ తూటా గురి తప్పి చిన్నారికి తగలడంతో అక్కడే కుప్పకూలింది.. వెంటనే స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పారు. వారంతా వచ్చి చూసే సరికి పాప చనిపోయింది.
కుక్క కరిచిందని గన్తో కాల్చి చంపిన తండ్రీకొడుకులు.. 75 ఏళ్ల తల్లిపై రేప్!
Kakinada Gun Firing News: ఈ ఘటన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. స్థానికంగా కొందరు ఎలాంటి అనుమతి లేకుండా నాటు తుపాకుల్ని తీసుకొచ్చి పందుల్ని వేటాడుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా కొందరు నాటు తుపాకుల్ని వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.