ETV Bharat / bharat

బంగాల్‌లో ఒకేదశలో ఎన్నికలపై ఈసీ క్లారిటీ!

బంగాల్​లో చివరి నాలుగు దశల్లో జరగనున్న ఎన్నికలను ఒకేసారి నిర్వహించమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముందుగా నిర్దేశించిన ప్రకారమే నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. కరోనా దృష్ట్యా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ మేరకు తెలిపింది.

Election commission
ఎన్నికల సంఘం
author img

By

Published : Apr 16, 2021, 5:49 AM IST

Updated : Apr 16, 2021, 7:06 AM IST

కరోనా ఉద్ధృతి దృష్ట్యా బంగాల్‌లో మరో నాలుగు దశల్లో జరగనున్న ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని.. ముందుగా నిర్దేశించిన ప్రకారమే నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.

బంగాల్‌లో ఇప్పటికే నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా, మిగతా 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో దేశంలో కరోనా రెండో దఫా ఉద్ధృతితో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ సమయంలో బంగాల్‌లో మరో నాలుగు దశల్లో జరగాల్సిన ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారనే ప్రచారం మొదలయ్యింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రస్తుతానికి అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మిగతా నాలుగు దశల్లో నిర్వహించాల్సిన ఎన్నికలను ఒకేసారి చేపట్టే విధంగా ఎన్నికల సంఘం ఆలోచన చేయాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బంగాల్​ భాజపా అధ్యక్షుడిపై ఈసీ ఆంక్షలు

Last Updated : Apr 16, 2021, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.