రెండు వారాల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కరోనాతో మరణించారు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర పుణెకి సమీపంలోని లోహ్‌గావ్ ధనోరిలో జరిగింది. అరుణ్ గైక్వాడ్(47) భారత వైమానిక దళంలో పనిచేస్తున్నారు. రోజుల వ్యవధిలో కుటుంబం తలకిందులైన చేదునిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఆయన భార్య వైశాలి (43), బావమరుదులు రోహిత్ (38), అతుల్ జాదవ్ (40)తో పాటు అత్త అల్కా జాదవ్ (62)ను కరోనాతో చనిపోయినట్లు తెలిపారు.
ఆయన కుటుంబంలో అత్త, భార్య, కుమార్తె సహా.. మొత్తం 17 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ మహమ్మారిని తేలికగా తీసుకోవద్దని.. ప్రతీ ఒక్కరూ నియమాలను పాటించాలని అరుణ్ గైక్వాడ్ సూచించారు. ''మీతో పాటు, మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి" అని విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రలో రెండో దశ విజృంభణకు ముంబయి తర్వాత అత్యంత ప్రభావితమైన నగరం పుణె. ఇక్కడ రోజూ 6,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ఇవీ చదవండి: కరోనా విజృంభణపై ప్రధాని మోదీ సమీక్ష