ETV Bharat / bharat

ప్రియుడి స్నేహితుల కిరాతకం.. ఆమెను దారుణంగా రేప్​ చేసి, బావిలో పడేసి... - బక్ష పోలీస్ స్టేషన్

ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. అనంతరం బాధితురాల్ని కత్తితో పొడిచి చంపి.. బావిలో పడేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

gang rape
హత్యాచారం
author img

By

Published : Aug 4, 2022, 1:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్ జౌన్​పుర్​లో దారుణం జరిగింది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు. అనంతరం కత్తితో పొడిచి హత్యచేసి.. బావిలో పడేశారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితుల్ని బక్ష పోలీసులు బుధవారం అరెస్టు చేసి జైలుకు పంపారు. బాధితురాలి హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:
జౌన్​పుర్​లోని బక్ష పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ యువతి జులై 23న తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రియుడి స్నేహితులు నలుగురు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం హత్యచేసి.. బావిలో పడేశారు. బాధితురాలి తండ్రి జులై 23న బక్ష పోలీస్ స్టేషన్​లో తన కుమార్తె కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. జులై 28న యువతి మృతదేహం స్వగ్రామంలోనే ఓ పాతబావిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆగస్టు 2న బాధితురాలి తండ్రి తన కుమార్తెను హత్య చేశారని నలుగురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరిని విచారించగా.. నేరం చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.

ఇదీ చదవండి: 'కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్'.. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

కానిస్టేబుల్ జాక్​పాట్.. ఆరు రూపాయల టికెట్​తో రూ.కోటి లాటరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.