నీటిలో మునిగిపోతున్న మిత్రుడిని కాపాడబోయి.. మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటక మండ్యాలోని కేఆర్ పేటే తాలూకాలో ఉన్న మండగెరె ఎడమ కాలువ వద్ద జరిగింది.
ఇదీ జరిగింది..
మండ్య కేఆర్ పేట్లో ఉండే చండగొల్లమ్మ గుడిని దర్శించుకోవడానికి.. మొత్తం 8మంది మిత్రులు మైసూర్ నుంచి వచ్చారు. పూజాది కార్యక్రమాల అనంతరం వారు సరదాగా ఈత కొట్టడానికి కాలువలో దిగారు. రాజు అనే యువకుడు మునిగిపోవడం చూసిన మరో స్నేహితుడు కాపాడేందుకు కాలువలోకి దిగాడు. చాలా సమయం గడిచినా.. వారు తిరిగి రాకపోవడం వల్ల మరో ఇద్దరు వారి కోసం గాలించేందుకు నీటిలోకి దిగారు. దురదృష్టవశాత్తూ వారందరు చనిపోయారు.
ఇది తెలిసి ఇద్దరు స్నేహితులు భయంతో అక్కడి నుంచి పరుగులతీశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేఆర్ పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
మరోవైపు చనిపోయిన వారిలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు.. మంజు, రాజు, చంద్రుగా గుర్తించారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: 'ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం!'