రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వారు ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను ఖివాసర్ ఆసుపత్రికి తరలించారు.
వాహనం వేగంగా వచ్చి చెట్టును ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు