కర్ణాటక కార్వార్లో సముద్రం ఒడ్డున ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. 40 ఏళ్ల క్రితం నీట మునిగిన ఓ విదేశీ ఓడ అలల దాటికి తీరానికి కొట్టుకువచ్చింది.
1981లో..
'చెరిమజు' అనే కార్గో షిప్ 1981లో నీటమునిగింది. సింగపూర్ నుంచి కార్వార్ హార్బర్‌కు.. 14, 418 టన్నుల డాంబర్ తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది నావికులను రక్షించారు అధికారులు.
అయితే.. ఘటన అనంతరం ఓడను బయటకు తీసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసినా.. అవి విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఓడలోని కొంత భాగాన్ని మాత్రమే పైకి తీసుకురాగలిగారు అధికారులు. అప్పుడు సముద్రంలో మిగిలిన ఓడ సగభాగం 40 ఏళ్ల తర్వాత కార్వార్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
ఇదీ చదవండి:సముద్రంలో మునిగిన ఇరాన్ నేవీ అతిపెద్ద ఓడ