ETV Bharat / bharat

టీఎంసీ నుంచి భాజపా గూటికి మరో కీలక నేత

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరో కీలక నేత టీఎంసీని వీడారు. ఇరవై ఏళ్లకుపైగ తృణమూల్​ కాంగ్రెస్​లో ఉన్న సుశాంత్​ పాల్​.. భాజపాలో చేరారు.

Trinamool Congress leader did squats on stage moments after joining the BJP
టీఎంసీని వీడి భాజపా గూటికి చేరిన మరో నేత
author img

By

Published : Mar 4, 2021, 7:33 PM IST

అసెంబ్లీ ఎన్నికల వేళ బంగాల్​ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ) నేత సుశాంత్​ పాల్​ ఆ పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గురువారం.. పింగ్లా ప్రాంతంలో జరిగిన భాజపా ఎన్నికల ర్యాలీలో సువేందు అధికారి సమక్షంలో.. కాషాయ కండువా కప్పుకున్నారు.

ప్రచార కార్యక్రమంలో గుంజిళ్లు తీస్తున్న సుశాంతపాల్​

1998 నుంచి టీఎంసీలో ఉంటూ సువేందు అధికారికి విధేయుడిగా పేరు తెచ్చుకున్న సుశాంత్​.. ఇన్నాళ్లూ నిరంకుశ పాలనలో ఉన్నానని టీఎంసీని ఉద్దేశించి అన్నారు. అందుకు ప్రాయశ్చితంగా తన ప్రసంగం మధ్యలో అందరి ముందు గుంజిళ్లు తీశారాయన. ఈ సందర్భంగా భాజపా మద్దతుదారులు జై శ్రీరామ్​ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్​తో పాటు.. టీఎంసీలో మున్సిపాలిటీ ఛైర్మన్​ వంటి పదవులు చేపట్టిన పలువురు నేతలు కూడా భాజపాలోకి చేరారు.

ఇదీ చదవండి: మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.