ETV Bharat / bharat

పీవీ సన్నిహితుడు రామ్ ఖండేకర్​ మృతి - రామ్ ఖండేకర్​ కుటుంబం

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుపొందిన రామ్ ఖండేకర్​ కన్నుమూశారు. పీవీతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వద్ద ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా చాలా కాలంపాటు పని చేశారు.

ram khandekar death
రామ్ ఖండేకర్​ మృతి
author img

By

Published : Jun 9, 2021, 5:13 PM IST

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు అత్యంత విశ్వాసపాత్రుడైన రామ్​ ఖండేకర్​(87) ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగ్​పుర్​లో కన్నుమాశారు. పీవీతో పాటు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంత్​రావు చవాన్​ వద్ద ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పీవీ మరణించేంత వరకు ఆయన వద్దే ఖండేకర్​ విధులు నిర్వర్తించారు.

ఈ ఇరువురు నేతలతో కలిసి రామ్​ ఖండేకర్​ 40 ఏళ్లకుపైగా పని చేశారు. 1985లో మహారాష్ట్ర నాగ్​పుర్​ జిల్లా రామ్​తేక్​ లోక్​సభ స్థానం నుంచి పార్లమెంటుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 1991లో పీవీ నర్సింహారావు ప్రధాని పదవి చేపట్టగా.. రామ్ ఖండేకర్​ను తన ప్రైవేట్​ సెక్రటరీగా నియమించుకున్నారు.

రాజకీయ నేతలతో తనకు ఉన్న అనుభవాలను వివరిస్తూ 'సత్తేచ్య పద్చాయత్​'(షాడో ఆఫ్​ పవర్​) పేరుతో పుస్తకం రాశారు ​ఖండేకర్.

ఇదీ చూడండి: వరి కనీస మద్దతు ధర పెంపు

ఇదీ చూడండి: ఈసీ​గా బాధ్యతలు స్వీకరించిన అనూప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.