ETV Bharat / bharat

ఆరు నెలల తర్వాత ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్​బీర్ సింగ్​ - పరమ్​బీర్ సింగ్ వార్తలు

ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరమ్​బీర్ సింగ్ చాలా రోజుల తర్వాత నగరంలో ప్రత్యక్షమయ్యారు. బలవంతపు వసూళ్ల కేసులో విచారణ కోసం అధికారుల ఎదుట హాజరయ్యారు(parambir singh news).

Former Mumbai Police Commissioner Param Bir Singh arrives in Mumbai
ఆర్నెళ్ల తర్వాత ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్​బీర్ సింగ్​
author img

By

Published : Nov 25, 2021, 1:28 PM IST

బలవంతపు వసూళ్ల కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్‌ ముంబయిలో ప్రత్యక్షమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తునకు సహకరించేందుకుగాను చండీగఢ్‌ నుంచి ఆయన వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ముంబయి విమానాశ్రయం నుంచి నేరుగా నేర విభాగం కార్యాలయానికి వెళ్లిన పరమ్‌బీర్‌ సింగ్‌ నుంచి గోరెగావ్‌ ఠాణాలో నమోదైన బలవంతపు వసూళ్ల కేసులో వాంగ్మూలం తీసుకున్నారు అధికారులు.

బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. పోలీసులు అరెస్ట్‌ చేయకుండా సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందారు(parambir singh news).

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్​యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్‌సుఖ్​ హిరేన్‌ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర సర్కార్‌ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా ఆఫీస్​కు వెళ్లలేదు(parambir singh mumbai police).

ముంబయికి వచ్చిన పరమ్​బీర్ సింగ్​పై మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్ విమర్శలు గుప్పించారు. కోర్టు ఆయన్ను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించినందువల్లే విచారణకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని పరమ్​బీర్ సింగ్​ కోర్టుకు చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై తప్పుడు ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు(param bir singh news).

హోంమంత్రి షాక్​..

ప్రాణహాని ఉందని పరమ్​బీర్ సింగ్ చెప్పడం తనకు షాకింగ్​గా ఉందని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అన్నారు. ముంబయి, ఠాణె పోలీస్​ కమిషన​ర్​గా పనిచేసిన ఓ సీనియర్​ ఐపీఎస్​ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నమ్మలేకపోతున్నాని చెప్పారు(parambir singh latest news).

తనకు ప్రాణహాని ఉందని, అందుకే రహస్యంగా తలదాచుకుంటున్నానని పరమ్​బీర్ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది న్యాయస్థానం(parambir singh missing).

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​ తనను నెలకు రూ.100కోట్లు వసూలు చేయమని ఆదేశించారని పరమ్​బీర్​ సింగ్ ఈ ఏడాది మేలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే హోంమంత్రి పదవికి దేశ్​ముఖ్ రాజీనామా కూడా చేశారు(parambir singh letter to cm).

ఇవీ చదవండి: పరమ్​Xదేశ్​ముఖ్​- 'మహా'లో లేఖ దుమారం

ముంబయి సీపీ పరమ్​బీర్​ సింగ్​ బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.