ETV Bharat / bharat

మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరెస్టు

మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్​ అరెస్టయ్యారు. చెన్నైలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్రాసు హైకోర్టులోని న్యాయమూర్తులు, వారి భాగస్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జస్టిస్ కర్ణన్​ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Former High Court Judge Karnan arrested in Chennai
మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరెస్టు
author img

By

Published : Dec 2, 2020, 3:52 PM IST

మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్​ చెన్నైలో అరెస్టయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు, వారి జీవితభాగస్వాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

న్యాయమూర్తుల ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇటీవలే ఓ వీడియోను విడదల చేశారు జస్టిస్​ కర్ణన్​. దీనిపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. మహిళలను అగౌరపరిచే విధంగా జస్టిస్​ కర్ణన్​ ఆరోపణలు చేశారని, ఆయనపై చర్యలు చేపట్టాలని మద్రాసు హైకోర్టులోని సీనియర్​ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేకు లేఖ రాశారు.

జస్టిస్​ కర్ణన్​ గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. కోర్టు ధిక్కరణ, న్యాయప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2017లో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు​.

ఇదీ చదవండి- మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.