ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో కార్చిచ్చు- రంగంలోకి వాయుసేన - ఉత్తరాఖండ్​లో కార్చిచ్చు

ఉత్తరాఖండ్​లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేేసేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు అధికారులు. సమీపంలోని సరస్సుల నుంచి నీటిని సేకరించి మంటలు వ్యాపించిన ప్రాంతాల్లో చల్లుతున్నారు. శనివారం ఏర్పడిన కార్చిచ్చుకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరాఖండ్​ అడవుల్లో కార్చిచ్చు, Forest fires in Uttarakhand
హెలికాప్టర్లతో అగ్నిమాపక చర్యలు
author img

By

Published : Apr 5, 2021, 1:52 PM IST

ఉత్తరాఖండ్​ కార్చిచ్చును అదుపు చేసేందుకు కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల సాయంతో అధికారులు ప్రస్తుతం తెహ్రీ గర్హవాల్​ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్థానిక తెహ్రీ సరస్సు నుంచి 5వేల లీటర్ల సామర్థ్యం ఉన్న భారీ బకెట్​తో నీటిని సేకరించి మంటలు చెలరేగుతున్న ప్రాంతంలో చల్లుతున్నారు.

అగ్నిమాపక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందిచేందుకు కేంద్రం ఆదివారం రెండు హెలికాప్టర్లను పంపించింది. ​

హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు

రాష్ట్రంలోని నైనితాల్, అల్మోరా, తెహ్రీ, పౌరీ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో శనివారం కార్చిచ్చు చెలరేగింది. మంటల ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గర్హవాల్​, కుమాన్​ ప్రాంతాల్లో 40 చోట్ల మంటలు ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12వేల మంది అటవీ శాఖ సిబ్బంది, 13వేల ఫైర్​ స్టేషన్లను రంగంలోకి దింపింది.

ఇటీవల కాలంలో తక్కువ వర్షపాతం నమోదు కావడమే కార్చిచ్చు చెలరేగడానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కార్చిచ్చుకు సంబంధించి మొత్తం 983 ఘటనలు జరిగాయని, 1,292 హెక్టార్ల అడవి దగ్ధమైందని వెల్లడించారు.

ఇదీ చదవండి : 'మహా' మంత్రి అనిల్​పై సీబీఐ దర్యాప్తు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.