ETV Bharat / bharat

ఆ ఓడకు అందరూ మహారాణులే! - women's day 2021 in india

నారీశక్తి తలుచుకుంచే చేయలేనిది అంటూ ఏమీ లేదు అనేలా దూసుకుపోతున్నారు మహిళలు. అంచెలంచెలుగా వారి ప్రతిభను వారే తట్టి లేపుకొంటూ...లక్ష్యాలను చేరుకుంటున్నారు. నిన్న ఫైటర్​ జెట్​ పైలట్​గా శివాంగి తన ఉనికిని చాటుకుంటే సముద్రయానంలో 'ఎం.టి. స్వర్ణకృష్' అనే భారీ నౌకను కూడా అలాంటి మహిళలే నడుపుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

For the first time in the world, a ship is run by all women
ఆ ఓడకు అందరూ మహారాణులే!
author img

By

Published : Mar 8, 2021, 6:42 AM IST

సంసార సాగరాన్నే కాదు.. కల్లోల సముద్రంలోనూ నౌకను నేర్పుగా నడిపే సామర్థ్యం నారీశక్తికి ఉంది. ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యం కలిగిన సముద్రయాన రంగంలో మూస పద్ధతులు, ఆలోచన ధోరణులను ఛేదించిన మహిళా లోకానికి జేజేలు పలికేందుకు కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టింది. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)కు చెందిన 'ఎం.టి. స్వర్ణకృష్' అనే భారీ నౌక ఇందుకు వేదికైంది. కేంద్ర రేవులు, నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ జెండా ఊపి ఈ చరిత్రాత్మక యాత్రను ప్రారంభించారు. ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి.

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యాత్రను కేంద్రం చేపట్టింది. ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టులోని లిక్విడ్‌ బెర్త్‌ జెట్టీ నుంచి స్వర్ణకృష్ణ బయలుదేరింది. మహిళా నావికా సిబ్బంది త్యాగాలు, సేవలను ఈ సందర్భంగా మంత్రి మాండవీయ కొనియాడారు.

For the first time in the world, a ship is run by all women
స్వర్ణ కృష్ట నౌక

స్వర్ణకృష్ణ.. పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్‌ నౌక. 2010లో దీన్ని నిర్మించారు. గరిష్ఠంగా 10.5 నాట్‌ (గంటకు దాదాపు 20 కిలోమీటర్లు)ల వేగంతో ప్రయాణిస్తుంది. 73 వేల టన్నుల బరువును ఇది మోసుకెళ్లగలదు.

ఇదీ చూడండి: ఉమెన్స్ డే: ఈ 'అమ్మ'లకు ఎవరూ సాటిరారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.