ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో డ్రోన్​ కలకలం- బలగాలు అప్రమత్తం - Drone news

జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఓ డ్రోన్‌(Drone in jammu) కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఎగురుతున్న డ్రోన్‌ను గుర్తించిన సరిహద్దు భద్రతాదళం (బీఎస్​ఎఫ్​) దానిపై కాల్పులు జరిపింది.

Drone
డ్రోన్​
author img

By

Published : Jul 14, 2021, 9:50 AM IST

Updated : Jul 14, 2021, 12:08 PM IST

జమ్ముకశ్మీర్‌ అర్ణియా సెక్టార్ వద్ద ఓ డ్రోన్‌(Drone in jammu) కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఎగురుతున్న డ్రోన్‌ను గుర్తించిన సరిహద్దు భద్రతాదళం (బీఎస్​ఎఫ్​) దానిపై కాల్పులు జరిపింది.

భారత భూభాగంలోనే సుమారు రెండువందల మీటర్ల ఎత్తులో ఎరుపురంగు కాంతితో మెరుస్తున్న వస్తువు కనిపించిన బీఎస్‌ఎఫ్ అధికారులు.. వెంటనే దానిపైకి కాల్పులు జరిపినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆ వస్తువు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిందన్న అధికారులు.. ఆ ప్రాంతంలో గాలించినప్పటికీ ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని పేర్కొన్నారు.

జులై 2న పాకిస్థాన్ వైపు నుంచి ఓ క్వాడ్ కాప్టర్‌ అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత ప్రాదేశిక భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరపగా.. ఆ ప్రయత్నం విఫలమైంది. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న వేళ.. తాజా ఘటనను బీఎస్‌ఎఫ్‌ తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం

Last Updated : Jul 14, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.