ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం.. 77 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష! - ఉత్తరప్రదేశ్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు ఓ యువకుడు. అనంతరం ఆమెను ఊరి అవతల పొదల్లోపడేసి వెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్ బులంద్​షహర్​లో నాలుగేళ్ల బాలికపై హత్యాచారం చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించింది న్యాయస్థానం.

five-year-old-girl-raped-and-thrown-into-bushes-in-uttarpradesh
ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ చేసి అత్యాచారం
author img

By

Published : Jul 26, 2023, 10:57 PM IST

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ దుర్మాగుడు. మంగళవారం బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు.. ఊరి అవతలికి ఆమెను తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని పొదల్లో పడేసి పారిపోయాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరిపి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన రింకు వర్మ ఈ ఘటనకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన రింకు వర్మ.. అనంతరం చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఊరి చివర్లో ఉన్న పొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అయితే చిన్నారి ఇంటికి రాకపోవడం వల్ల కంగారు పడ్డ కుటుంబ సభ్యులు.. ఆమెను వెతకడం ప్రారంభించారు. ఎంతకీ బాలిక ఆచూకీ లభించకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. ఊరి చివర పొదల్లో చిన్నారిని గుర్తించారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన రింకు వర్మ ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. అతడ్ని అదుపులోకి తీసుకుని.. పోక్సో, హత్య నేరాల కింద కేసు నమోదు చేశారు.

నాలుగేళ్ల బాలికపై హత్యాచారం.. దోషికి మరణ శిక్ష
మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్ బులంద్​షహర్​లో నాలుగేళ్ల బాలికపై హత్యాచారం చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. ఘటన జరిగిన 77 రోజుల్లోనే నిందితుడిని దోషిగా తేల్చింది. రాక్షసులు మాత్రమే ఇలాంటి హీనమైన చర్యకు పాల్పడతారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దోషికి రూ.3లక్షల జరిమానా సైతం విధించింది.

కేసు వివరాలిలా..
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వరుణ్ కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 25న ఫహీమ్ అనే వ్యక్తి నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను కొట్టి చంపేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. 14 రోజుల్లోనే ఛార్జ్​షీట్ ఫైల్ చేశారు. అప్పటి నుంచి దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. అత్యంత పాశవికంగా బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్య పరీక్షలో తేలింది. చిన్నారి శరీరంలోని ఎనిమిది చోట్ల పంటిగాట్లు కనిపించాయి. శరీరమంతటా గాయాలు ఉన్నాయి. బాలిక ప్రైవేటు భాగాలకూ గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు దోషికి వ్యతిరేకంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వీటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం బుధవారం ఫహీమ్​ను దోషిగా తేల్చింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.