ETV Bharat / bharat

Exit Polls 2022: మెజారిటీ రాష్ట్రాల్లో భాజపాదే హవా- కానరాని కాంగ్రెస్! - Manipur exit polls 2022

Exit Poll Results 2022: సెమీ సార్వత్రిక ఎన్నికలుగా భావించే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​కు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. మెజారిటీ రాష్ట్రాల్లో భాజపా ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి! ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​తో పాటు ఉత్తరాఖండ్​, గోవా, మణిపుర్​ రాష్ట్రాల్లో భాజపాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఈసారి ఆప్‌ పాగా వేస్తుందని ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేశాయి.

Exit Polls 2022
Exit Polls 2022
author img

By

Published : Mar 8, 2022, 5:04 AM IST

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాల్లో భాజపా ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి! అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మణిపుర్‌లో ఆ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో అంచనా వేశాయి. ఉత్తరాఖండ్‌లోనూ ఆ పార్టీకి విజయావకాశాలు మెండుగానే ఉన్నట్లు తెలిపాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్‌ తలెత్తే అవకాశాలున్నట్లు వెల్లడించాయి. మరో కీలక రాష్ట్రం పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాకిస్తూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారాన్ని కైవసం చేసుకోనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. యూపీలో ఏడో విడత పోలింగ్‌ సోమవారం ముగిసిన వెంటనే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలను ఈ నెల 10న ప్రకటించనున్నారు.

యూపీ: కమల దరహాసం

ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడటం దాదాపుగా లాంఛనమే! అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి గట్టిగానే ప్రయత్నించినప్పటికీ.. మెజార్టీ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోనుంది. బీఎస్పీ మూడో స్థానంతో, కాంగ్రెస్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకోనున్నాయి.

Exit Polls 2022
ఉత్తర్​ప్రదేశ్ ఎగ్జిట్​ పోల్స్​​

పంజాబ్‌: ఆప్‌ అదుర్స్‌

రాష్ట్రంలో ఓటర్లు మార్పు కోరుకున్నారు! కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ.. ఆప్‌ వైపు మొగ్గారు. ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం దాదాపు ఖాయం! ఈ ఫలితంతో ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరణకు గట్టి ఆదరువు దొరికినట్లవనుంది. రాష్ట్రంలో ప్రధానంగా అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా పరిణమించాయి.

Exit Polls 2022
పంజాబ్​ ఎగ్జిట్​ పోల్స్​

ఉత్తరాఖండ్‌: భాజపా-కాంగ్రెస్‌.. నువ్వా నేనా

రాష్ట్రంలో ఈ దఫా భాజపా, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. ఇరు పార్టీల మధ్య విజయం దోబూచులాడుతోంది. అయితే- రెండింటిలో కమలదళానిదే కాస్త ముందంజ అన్న సంకేతాలున్నాయి.

Exit Polls 2022
ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్​

మణిపుర్‌: భాజపాదే పీఠం!

రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం నాటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిల్చినప్పటికీ, సరైన సమయంలో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన భాజపా.. ఈ దఫా సొంతంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏకైక అతిపెద్ద పార్టీగా అది అవతరించడం ఖాయం! కాంగ్రెస్‌ చాలా దూరంగా రెండో స్థానంలో నిలవనుంది.

Exit Polls 2022
మణిపుర్​ ఎగ్జిట్​ పోల్స్​

గోవా: హంగ్‌ దిశగా..

ఎప్పట్లాగే గోవాలో హంగ్‌ తలెత్తే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లు మెజార్టీ మార్కుకు కాస్త దూరంలో ఆగిపోతాయని అంచనా. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి కొన్ని సీట్లు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే అవకాశాలున్నాయి.

Exit Polls 2022
గోవా ఎగ్జిట్​ పోల్స్​
Exit Polls 2022
ఆయా రాష్ట్రాల్లో కావాల్సిన మెజారిటీ

ఇదీ చూడండి: 'మోదీ సర్కార్ అంటేనే 'ప్రచారం''.. రాహుల్ ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.