Five Members of Same Family Drowned in River : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణం ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని సిరిసిలో జరిగింది. ఆదివారం సెలవు దినం కావడం వల్ల శాల్మలా నదికి విహారయాత్రకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతిచెందడం వల్ల తీవ్ర విషాదం నెలకొంది.
ఇదీ జరిగింది
శల్మలా నది ఓ టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దారు. సెలవు దినాల్లో విహారయాత్రలకు పెద్ద ఎత్తున జనం వస్తుంటారు. ఈక్రమంలోనే ఆదివారం కావడం వల్ల సిరసికి చెందిన కుటుంబసభ్యులు విహార యాత్రకు వచ్చారు. కుటుంబమంతా సరదాగా ఆడుకుంటున్న క్రమంలో ఓ బాలుడు నీటిలో మునిగిపోయాడు. దీనిని గమనించిన మౌలానా అహ్మద్ అనే వ్యక్తి వెంటనే నీటిలోకి దూకి అతడిని కాపాడి బాలుడి తల్లి నదియాకు ఇచ్చాడు. ఆ బాలుడిని ఒడ్డుకు చేర్చగానే కాలుజారడం వల్ల నదియా సైతం నీట మునిగింది. వీరిని గమనించిన మరో ముగ్గురు కుటుంబసభ్యులు తల్లికొడుకులను కాపాడేందుకు నీటిలోకి దిగగా వారు మునిగిపోయారు. ఫలితంగా మొత్తం ఐదుగురు నీట మునిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రానికి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు అధికారులు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. స్థానికులు సైతం మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను సిరసి పట్టణానికి చెందిన మౌలానా అహ్మద్ ఖలీల్ (44), నదియా నూర్ అహ్మద్(20), మిస్బా తబ్సమ్(21), నబిల్ నూర్ అహ్మద్(22), ఉమర్ సిద్ధిఖి(23)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నీట మునిగి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
అంతకుముందు బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుంటలో పడి మృతిచెందారు. మఝోలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమారియా గ్రామంలో జరిగింది. కుంట పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నీట మునిగి ఐదుగురు చిన్నారులు మృతి- సీఎం సంతాపం, రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఉత్సవాల్లో విషాదం.. నదిలో మునిగి ముగ్గురు మృతి.. యాక్సిడెంట్లో మరో ఐదుగురు..