ETV Bharat / bharat

నీటి గుంతలో పడి ఐదుగురు చిన్నారులు మృతి

బిహార్​లోని సహ్​రసా జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇటుకల తయారీ కోసం తీసిన నీటి గుంతలో పడి ఐదుగురు పిల్లలు చనిపోయారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.

Five children died
ఐదుగురు చిన్నారుల మృతి
author img

By

Published : Jun 12, 2021, 10:36 PM IST

బిహార్​ సహ్​రసా జిల్లా బస్తీ ప్రాంతంలో విషాదం జరిగింది. నీటితో ఉన్న గుంతలో స్నానం చేద్దామని ఐదుగురు పిల్లలు అందులోకి దిగారు. గుంతలోతు ఎక్కువ ఉండడం వల్ల నీటిలో మునిగి చనిపోయారు. మృతి చెందిన పిల్లలు 8-12ఏళ్ల వయస్సువారే.

చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. పిల్లల్ని చూడడానికి పెద్దఎత్తున గ్రామస్థులు తరలివచ్చారు. ఇటుకలను తయారీ చేయడం కోసం అక్కడ గుంతను తవ్వారని, అందులో పడి పిల్లలు మృతి చెందడం బాధకారమని స్థానికులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. పిల్లల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా చూస్తామని మృతుల కుటుంబాలకు మండల అధికారి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Live Video: గంగా నదిలో మునిగిన భారీ క్రేన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.