Uphaar Cinema Hall Fire: వేసవికాలంలో అగ్నిప్రమాద ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దిల్లీ గ్రీన్ పార్క్ మెట్రోస్టేషన్ సమీపంలోని ఉపహార్ సినిమా థియేటర్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. క్షణాల్లో హాల్ మొత్తం విస్తరించాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. థియేటర్ బాల్కనీ, ఫ్లోర్ దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 9 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు.
ఉదయం 4.46 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. 3 గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. థియేటర్ లోపల సీట్లు, ఫర్నీచర్ దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల అసలు కారణం తెలియరాలేదు. 1997 జూన్ 13న ఇదే థియేటర్లో.. సినిమా ప్రదర్శన సమయంలోనే జరిగిన అగ్నిప్రమాదం 59 మందిని బలితీసుకుంది. ఊపిరాడక అభిమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా గాయపడ్డారు.
ఇవీ చూడండి: కుమారుడితో ఆడుకుంటూ.. అలల్లో కొట్టుకుపోయిన తండ్రి