ETV Bharat / bharat

కెమికల్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు - ఏడుగురు మృతి, మరో 24మందికి గాయాలు - కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ ఆక్సిడెంట్

Fire Accident In Surat : గుజరాత్​.. సూరత్​లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.

Fire Accident In Surat
Fire Accident In Surat
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 10:05 AM IST

Updated : Nov 30, 2023, 12:15 PM IST

Fire Accident In Surat : గుజరాత్​.. సూరత్​లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడం వల్ల ఏడుగురు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. ప్రమాదంలో అగ్నికి ఆహుతైన ఏడు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్​మార్టం పరీక్షల కోసం సూరత్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బుధవారం జరిగిందీ దుర్ఘటన.

సూరత్​లోని సచిన్​ జీఐడీసీ కెమికల్​ ఫ్యాక్టరీలో నవంబర్​ 29వ తేదీన ఉదయం సుమారు రెండు గంటల సమయంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే 15 ఫైర్​ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. దాదాపు తొమ్మిది గంటలుపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఏడుగురిలో ఒకరు ఉద్యోగి కాగా మిగిలిన ఆరుగురు కాంట్రాక్ట్​పై పనిచేస్తున్నారని సూరత్ కలెక్టర్​ ఆయూష్​ ఓక్​ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 24 మందిని వివిధ ఆస్పత్రుల్లో చిక్సిత పొందుతున్నారని కలెక్టర్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలోని పెద్ద ట్యాంకులో నిల్వ ఉండే మండే రసాయనాలు లీకేజి కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సూరత్​ ఫైర్ చీఫ్ ఆఫీసర్ బసంత్ పరీక్ వెల్లడించారు.

బాణసంచా గోదాంలో పేలుడు.. 13 మంది మృతి
Firecracker Shop Blast : కొద్ది రోజుల క్రితం.. కర్ణాటకలోని బెంగళూరు-హోసూరు జాతీయ రహదారిపై ఉన్న ఓ బాణాసంచా గోదాంలో పేలుడు సంభవించింది. అనేకల్​ తాలుకాలోని అత్తిబెలె గ్రామంలో ఉన్న బాలాజీ క్రాకర్స్ షాపులో సాయంత్రం ఏడు గంటల సమయంలో చిన్నగా చెలరేగాయి. అనంతరం మంటలు వేగంగా వ్యాపించడం వల్ల గోదాం మొత్తం పేలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో నలుగురు తప్పించుకున్నారు. బాణసంచా లోడ్​ను లారీ నుంచి గోదాంలోకి దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే గోదాం సమీపంలో ఉన్న అనేక వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

బొగ్గు గని కంపెనీ ఆఫీస్​లో భారీ అగ్నిప్రమాదం- 26మంది మృతి

దీపావళి వేడుకల్లో అగ్నిప్రమాదం- లండన్​లో ఒకే కుటుంబంలోని ఐదుగురు భారతీయులు మృతి

Last Updated : Nov 30, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.