ఫిల్మ్‌మేకర్ ప్రకాశ్ ఝా తెరకెక్కిస్తున్న 'ఆశ్రమ్' వెబ్‌సిరీస్(Ashram Web Series News) మూడో సీజన్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. మధ్యప్రదేశ్ భోపాల్‌లో 'ఆశ్రమ్' సెట్‌పై భజ్రంగ్ దళ్ కార్యకర్తలు... ఆదివారం సాయంత్రం దాడి చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వెబ్‌సిరీస్‌ను(Ashram Web Series News) తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రకాశ్ ఝాపై(Prakash Jha News) సిరా జల్లారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆశ్రమ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లోకి(Ashram Web Series News) ప్రవేశించిన బజ్‌రంగ దళ్ కార్యకర్తలు రెండు బస్సుులపై రాళ్లు విసిరారని భోపాల్ ఎస్పీ సాయి కృష్ణ తోట తెలిపారు. షూటింగ్ జరగనివ్వబోమని బెదిరించారని, ఫిల్మ్‌మేకర్ ప్రకాశ్ ఝాపై సిరా జల్లారని చెప్పారు. ప్రొడక్షన్ సిబ్బందిలో ఒకరు గాయపడ్డారని పేర్కొన్నారు.
'ముందే తెలియజేయాలి'
'ఆశ్రమ్' సెట్ దాడిపై మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్ర సోమవారం స్పందించారు. తాము తీయబోయే కథల్లో ఏమైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నట్లైతే.. షూటింగ్‌కు అనుమతి తీసుకునే సమయంలోనే వాటి గురించి అధికారులకు ముందే తెలియజేయాలని వ్యాఖ్యానించారు. ఆశ్రమ్ వెబ్ సిరీస్ పేరును మార్చాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.
"వెబ్ సిరీస్‌కు ఆశ్రమ్ అని పేరు ఎందుకు పెట్టాలి? వేరే మతానికి చెందిన పేర్లను పెడితే ఏం జరిగేదో వారికి తెలుస్తుంది. దాడి చేయడం మాత్రం తప్పే. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశాం. వారిపై న్యాయపరమై చర్యలు తీసుకుంటాం. ప్రకాశ్ ఝా తన తప్పులను గురించి కూడా ఆలోచించుకోవాలి.
-నరోత్తమ్ మిశ్ర, మధ్యప్రదేశ్ హోం మంత్రి".
'చర్యలు తీసుకోవాలి..'
మరోవైపు.. ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌పై జరిగిన దాడిని వివిధ సినిమా సంఘాల ఖండించాయి. హింసాత్మక చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ), ద ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేశాయి. బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నాయి.
'అంతా ఏకమవ్వాలి'
ఆశ్రమ్ వెబ్‌సిరీస్ సెట్‌పై(Ashram Web Series News) దాడిని ఫిల్మ్‌మేకర్ హన్సల్ మెహతా, సుధీర్ మిశ్ర, ప్రితీస్ న్యాండీ సహా పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. హిందీ చలన చిత్ర పరిశ్రమ లక్ష్యంగా జరగుతున్న ఈ దాడులకు వ్యతిరేకంగా అంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
"భయంతో నిశ్శబ్దంగా ఉండటం, పట్టించుకోకుండా ఉంటే... అలాంటి పోకిరీలకు, అణచివేతలకు కారణమవుతుంది. అయితే..పిల్లికి గంట కట్టేదెవరు?" అని హన్సల్ మెహతా ట్వీట్ చేశారు.
"నవ భారతంలో ఎవరికీ భద్రత లేదు. ఇలాంటి ఘటనలు జరగడం అవమానకరం. మూకదాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించకపోతే... ఎవరిపైనా, ఎక్కడైనా ఇలాంటి దాడులకే దిగుతారు. అని నటి స్వర భాస్కర్ ట్వీట్ చేశారు.
"ఇది భయానకం. పరిశ్రమ అంతా ఏకమవ్వాలి. అసోసియేషన్లు తమ సభ్యులకు మద్దతుగా నిలవాలి అని సుధీర్ మిశ్ర ట్వీట్ చేశారు. ఈట్వీట్‌పై స్పందించిన అశ్వినీ చౌదరీ... "అసోసియేషన్లు ఎప్పడూ అండగా నిలవవు. ప్రభుత్వం చేతుల్లో అవి బందీగా ఉన్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: 'భజరంగ్ దళ్‌ను నిషేధిస్తే ఇబ్బందా?'