ETV Bharat / bharat

Festival Celebrations at Ramoji Film City : రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి పండుగ సంబురాలు.. ఇక సందడే సందడి - 110 Years of Indian Film Celebrations at RFC

Festival Celebrations at Ramoji Film City : ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ.. దసరా, దీపావళి పండుగ సంబురాలకు ముస్తాబైంది. అక్టోబరు 12 నుంచి ప్రారంభమయ్యే ఈ అపూర్వ వేడుకలు 46 రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులకు అవకాశం కల్పించేలా ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను రూపొందించారు.

Ramoji Film City
Ramoji Film City
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 10:50 AM IST

Festival Celebrations at Ramoji Film City : భూతలస్వర్గం రామోజీ ఫిల్మ్‌సిటీలో ( Ramoji Film City) రానున్న దసరా, దీపావళి సెలవు రోజుల్లో పండుగ వేడుకలు సందడిగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అక్టోబరు 12 నుంచి ప్రారంభమయ్యే ఈ అపూర్వ వేడుకలు 46 రోజుల పాటు పర్యాటకులను సంతోషాల్లో తేలియాడేలా చేయనున్నాయి. అద్భుతమైన కార్నివాల్‌ వినోదంతో పాటు.. ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్‌తో అద్వితీయ అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేశారు.

FTCCI Excellence Awards 2023 : 'రామోజీ ఫిల్మ్‌సిటీ'కి ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు

110 Years of Indian Cinema Celebrations : పర్యాటకులు రోజంతా ఆనందోత్సాహాల్లో మునిగి తేలడంతో పాటు.. సాయంత్రం వినోదాలను ఆస్వాదిస్తూ రాత్రి 9 గంటల వరకు రామోజీ ఫిల్మ్‌సిటీలోని వేడుకల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సంబురాల్లో పాల్గొనేందుకు పర్యాటకులకు అవకాశం కల్పించేలా ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను రూపొందించారు. భారతీయ చలనచిత్ర రంగం (Indian Cinema) 110వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. అద్భుతమైన సినీ ప్రయాణానికి నీరాజనాలర్పించేలా అద్వితీయమైన పాటలు, డ్యాన్స్‌లతో 90 నిమిషాల లైవ్‌ షో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆబాలగోపాలం కళ్ల ముందు భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆవిష్కరించనుంది.

కార్నివాల్‌ పరేడ్‌లో..: రామోజీ ఫిల్మ్‌సిటీ సుందర మార్గాల్లో డీజేతో కూడిన కార్నివాల్‌ పరేడ్‌ సందర్శకులను ఆనంద డోలికల్లో తెలియాడేలా చేయనుంది. మిరుమిట్లు గొలిపే లైటింగ్‌లతో ఆకట్టుకొనేలా సాగే ఈ పరేడ్‌లో స్టిల్ట్‌ వాకర్లు, అద్భుత నృత్యాలు సంభ్రమాశ్చర్యాలు కలిగించే కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. రాజసం ఉట్టిపడేలా సాగే పరేడ్‌లో భాగస్వాములవడం ఓ అద్భుత అవకాశమనే చెప్పాలి.

అద్భుత లోకం ..: రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలు సరికొత్త వెలుగులతో అద్భుత లోకాన్ని తలపించేలా పర్యాటకులకు స్వాగతం పలకనున్నాయి. ఆకట్టుకొనే ఫౌంటెయిన్లు, సినిమా సెట్టింగులు, ఆహ్లాదం పంచే గార్డెన్లు, పక్షుల పార్కు, ఇంద్రధనస్సులను తలపించేలా మెరిసే మార్గాల్లో విహారం సరికొత్త ప్రపంచాన్ని కళ్లముందుకు తీసుకొస్తాయి.

డీజే బీట్‌.. పసందైన విందు..: రామోజీ ఫిల్మ్‌సిటీలోని సన్‌ ఫౌంటెయిన్‌ వద్ద సాయంత్రం సమయాల్లో డీజే బీట్‌లను ఆస్వాదిస్తూ అత్మీయులతో కలిసి అద్భుత రుచుల విందును ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలు..: ఆహ్లాదకరమైన అనుభూతిని సొంతం చేసుకుంటూ పండుగ సంబురాల్లో పర్యాటకులు పాల్గొనే అవకాశం కల్పించేలా వివిధ టూర్‌ ప్యాకేజీలను అందిస్తున్నారు. పర్యాటకులకు అనువైన సమయాలకు అనుగుణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (ఈవెనింగ్‌ ప్యాకేజీ) ప్రత్యేక ప్యాకేజీలు వేడుకల్లో పాల్గొన్నాలనుకునే వారికి అందుబాటులో ఉంటాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో విడిది చేసి వేడుకల్లో ఆనందించేందుకు ఆకర్షణీయమైన స్టే ప్యాకేజీలు సైతం ఉన్నాయి. మరిన్ని వివరాలకు.. www.ramojifilmcity.com లో లేదా టోల్‌ ఫ్రీ నంబరు 1800 120 2999 ను సంప్రదించవచ్చు.

ఈట్‌ రైట్‌ క్యాంపస్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీ

రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాలు పంచుతున్న వింటర్ ఫెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.