ETV Bharat / bharat

రన్నింగ్ ట్రైన్ కింద పడ్డ తండ్రి.. ఆరేళ్ల కొడుకునీ లాక్కెళ్లి... - రన్నింగ్ ట్రైన్ కింద పడ్డ తండ్రి

Father suicide running train: ఆరేళ్ల కొడుకుతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు ఓ వ్యక్తి. బాలుడు ప్రాణాలతో బయటపడగా.. అతడి తండ్రి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.

Father suicide running train
రన్నింగ్ ట్రైన్ కింద పడ్డ తండ్రి
author img

By

Published : Feb 17, 2022, 10:42 AM IST

Updated : Feb 17, 2022, 1:34 PM IST

రన్నింగ్ ట్రైన్ కింద పడ్డ తండ్రి

Father suicide running train: మహారాష్ట్రలోని ఠాణెలో దారుణం చోటు చేసుకుంది. విఠల్​వాడీ రైల్వే స్టేషన్​లో ఓ వ్యక్తి తన ఆరేళ్ల కుమారుడితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయి నుంచి పుణె వెళ్తున్న డెక్కన్ ఎక్స్​ప్రెస్ కింద పడి తండ్రి మరణించగా.. కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు.

మృతుడిని ప్రమోద్ అంధాలేగా పోలీసులు గుర్తించారు. ఉల్హాస్​నగర్​ ప్రాంతంలోని శాంతినగర్​లో అతడు నివాసం ఉంటున్నాడని తెలిపారు. బుధవారం సాయంత్రం తన కొడుకుతో కలిసి రైల్వే స్టేషన్​కు వచ్చాడని చెప్పారు.

ఈ హృదయవిదారక ఘటన సీసీటీవీలో నమోదైంది. ప్రమోద్ అంధాలే రైలు కోసం ఎదురుచూస్తూ ప్లాట్​ఫాంపై నిల్చున్నాడు. అటు నుంచి రైలు వస్తుండటాన్ని గమనించి.. తన కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్లాట్​ఫాంపై దూకాడు.

రైల్వే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: భాజపా కార్యాలయంలోనే హెడ్​కానిస్టేబుల్​​ ఆత్మహత్య

Last Updated : Feb 17, 2022, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.