నాలుగేళ్ల బాలికను అపహరించి హత్య చేసిన కేసులో ముజఫర్నగర్ జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నిందితులు ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే.. ఒక్కొరికి రూ.60వేల చొప్పున జరిమానా విధించింది.
ఇదీ జరిగింది..
2011 డిసెంబర్లో ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లా ఖోజా నగలా గ్రామంలో నాలుగేళ్ల బాలిక.. తన ఇంటి నుంచి దుకాణానికి వెళ్లింది. ఎంతకి తిరిగి రాలేదు. కేసులో ప్రధాన నిందితుడు సొహేల్ సహా అతని కుమారులు హుస్సేన్, తన్వీర్, పర్వేజ్, కలీమ్లు.. బాలికను అపహరించి వారి ఇంట్లో నిర్బంధించారు. కానీ ఆ బాలిక ఏడుస్తుండటం వల్ల వారిని ఎవరైనా గుర్తిస్తారనే భయంతో నిందితులు ఆమెను హత్య చేశారు. బాలిక మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసి వచ్చారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి : 'ప్రజాస్వామ్యంపై భారత్కు మీ పాఠాలు అనవసరం'