శిశువుకు పోలియో టీకా (Polio News) వేయించేందుకు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయలేదు ఓ తండ్రి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వరదకు ఎదురీదాడు. కుంభవృష్టి వల్ల వాహనాలు నడవలేని పరిస్థితిలో.. ఓ పాత్రలో పాపాయిని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. ఈ అపురూప సంఘటన ఝార్ఖండ్‌లో (Jharkhand News) జరిగింది.
ఏం జరిగిందంటే?
సాహిబ్‌గంజ్ జిల్లాలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం (Pulse Polio Campaign) జరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతమైన సిర్సా గ్రామానికి వైద్యుల బృందం చేరుకుంది. ఈ క్రమంలో తన శిశువుకు టీకా (Polio Vaccine) వేయించాలాని భావించిన ఓ తండ్రికి.. కుండపోత వర్షంలో ఏ ఒక్క వాహనం లభించలేదు. పైగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని అతడు దాటాల్సి ఉంది. దీంతో చిన్నారిని ఓ పాత్రలో పెట్టి, వరదను దాటుకుంటూ ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడతడు.
అలా పాత్రలో చిన్నారితో వచ్చిన వ్యక్తిని చూసి ఆరోగ్య సిబ్బంది (Healthcare Workers) చలించిపోయారు. అతడి ప్రయత్నానికి అభినందించారు. చిన్నారి సహా అతడిని ఫొటో తీశారు.
ఆ చిత్రం ఓ గొప్ప ఆశయ సాధనకు నిదర్శనంగా కనిపిస్తోంది. తన పాప సురక్షిత భవిష్యత్తు కోసం ఎలాగైనా టీకా వేయించాలనే తండ్రి దృఢసంకల్పం, వరదల్లోనూ టీకా అందిచడానికి గ్రామాలకు చేరుకున్న ఆరోగ్య సిబ్బంది శ్రమకు ప్రతిరూపంగా నిలుస్తోంది. పోలియో టీకా అవశ్యకతపై (Polio Vaccine Importance) ప్రజల్లో చైతన్యం కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ చేస్తున్న కృషిని చాటుతోంది.
ఇదీ చూడండి: ఫ్రెండ్‌ను నమ్మి వెళ్లడమే ఆ బాలిక తప్పు.. ఏడుగురు కలిసి...