ETV Bharat / bharat

రాజ్​భవన్ల ఎదుట నిరసనలకు సన్నద్ధం

జాన్ 26న దేశంలోని రాజ్​భవన్​లను ముట్టడిస్తామని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి 7 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఈ ఘెరావ్​ చేపట్టనున్నట్లు పేర్కొంది.

rajbhavan gherao
రాజ్​భవన్ ముట్టడి, రైతు సంఘం
author img

By

Published : Jun 12, 2021, 11:06 AM IST

జూన్​ 26న దేశవ్యాప్తంగా రాజ్​భవన్​లను ముట్టడిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఆ రోజును 'కేతి బచావో, లోక్​తంత్ర బచావో' (వ్యవసాయాన్ని కాపాడండి- ప్రజాస్వామ్యాన్ని రక్షించండి) దివస్​గా జరుపుకుంటామని పేర్కొంది(Farmers protest).

"1975 జూన్ 25న నాటి ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు కూడా దాదాపు అంతే ఉన్నాయి. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. అదే సమయంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి 7 నెలలు కావస్తోంది. జూన్ 26న కేతి బచావో-లోక్​తంత్ర బచావో దివస్​ జరుపుతాం. రాజ్​భవన్​లను ముట్టడిస్తాం."

--ఇంద్రజిత్ సింగ్, ఆల్​ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు.

సాగు చట్టాల రద్దు కోరుతూ రైతులు ఉద్యమం చేపట్టి ఆరు నెలలు గడించింది. ఇప్పటికే ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా వివాదం కొలిక్కి రాలేదు.

ఇదీ చదవండి:'ప్రధానిని గద్దె దించడమే నా లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.