సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు.. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నేడు 'సద్భావన దినం' పాటిస్తామని తెలిపారు రైతు సంఘాల నేతలు. రోజంతా నిరాహార దీక్ష చేపడతామని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఈ దీక్ష చేస్తామన్నారు.
'మరికొందరు ఉద్యమంలో చేరుతారు'
ఆందోళన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకపోతే దీని గురించి కూడా నిరసనలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది రైతులు ఉద్యమంలో పాల్గొంటారని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలను అణచివేయడానికి భాజపా సర్కారు కుట్ర పన్నుతోందని ఆరోపించారు రైతు నాయకులు. ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిందన్నారు.
'భాజపా ఉపన్యాసం అవసరం లేదు'
"జాతీయ జెండాను గౌరవించడం గురించి భాజపా ఉపన్యాసాలు అవసరం లేదు. ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది రైతుల పిల్లలు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు" అని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు యుధ్వీర్ సింగ్ అన్నారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేత