అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటించి భాజపాను ఓడించమని ప్రజల్ని కోరుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టి 100 రోజులు కావొస్తున్న నేపథ్యంలో.. మార్చి 6న కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేను దిగ్బంధించనున్నట్లు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో రైళ్లను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు మార్చి 12న రైతు నేతలు బంగాల్లో ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత బల్బీర్ సింగ్ రాజేవల్.. పశ్చిమ్ బంగా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
" ఏ పార్టీ కోసం ఓట్లు అడగం. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన భాజపాను ఓడించమని కోరుతాం."
-బల్బీర్ సింగ్. రైతు నేత.
మార్చి 8న 'మహిళ దినోత్సవం' సందర్భంగా మరో ర్యాలీని నిర్వహించనున్నట్లు.. ఆ ర్యాలీకి మహిళలే ప్రాతినిధ్యం వహించనున్నట్లు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.
తదుపరి కార్యాచరణ..
మార్చి 5- కర్ణాటకలో 'ఎమ్ఎస్పీ దిలావో' పేరుతో ఉద్యమం
మార్చి 6- కేఎంపీ ఎక్స్ప్రెస్ వే దిగ్భందం
మార్చి 8- దిల్లీ సరిహద్దుల్లో మహిళ ప్రాతినిధ్యంలో ర్యాలీ
మార్చి 12- ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో రైతు నేతల పర్యటన
మార్చి 15- ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగుల భారీ ర్యాలీ. ఇందులో రైతులు కూడా పాల్గొంటారు.
ఇదీ చదవండి:'సైబర్ దాడి నిజమే- చైనానేనని చెప్పలేం!'