సాగు చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్దులో రైతన్నలు చేస్తోన్న ఆందోళన 33వ రోజుకు చేరింది. సింఘు, టిక్రి, ఘాజిపూర్, చిల్లా సహా పలు దిల్లీ సరిహద్దుల వద్ద రైతులు భైఠాయించారు. ఎముకలు కొరికే చలిలోనూ పట్టుసడలని రైతులు.. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రంతో ఈ విషయంపై మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చించేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. 4 అంశాలతో చర్చల అజెండా ప్రతిపాదించారు. రైతులు ప్రతిపాదించిన అజెండాపై నేడు కేంద్రం స్పందించే అవకాశం ఉంది. అజెండా ఖరారులో కేంద్రం సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి రైతు సంఘాలు. నేడు మరోసారి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి.
- ఇదీ చూడండి:'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే'