నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. నలుగురు సభ్యులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది.
కమిటీలో సభ్యులుగా వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ మాజీ ఛైర్మన్ అశోక్ గులాటి, జాతీయ వ్యవసాయ అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రమోద్ జోషి, హర్సిమ్రత్ మాన్, భూపేంద్ర సింగ్ మాన్, అనిల్ ధన్వంత్ ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.