వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తోన్న రైతులు నేడు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
దిల్లీ-గాజీపుర్ సరిహద్దుల్లో రోడ్లపై పెద్ద పెద్ద బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపుతప్పితే నిరసనకారులను చెదరగొట్టేందుకు నీళ్ల ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు.
ఎర్రకోట సహా వివిధ ప్రాంతాల్లో పోలీసులు.. భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: నేడు రైతుల చక్కాజామ్- దిల్లీ పోలీసులు అప్రమత్తం