ETV Bharat / bharat

'మీరు చెబితే వింటారు'- మోదీ తల్లికి రైతన్న లేఖ - ప్రధాని తల్లికి లేఖ

సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లికి ఓ రైతు లేఖ రాశారు. తల్లి చెప్పిన మాట కుమారుడు వింటారని హీరాబెన్​కు రాశారు. ఈ లేఖలో వ్యవసాయ చట్టాలపై ఉన్న తన ఆవేదనను వ్యక్తం చేశారు.

farmer writes a letter to pm modis mother on farm laws
'అమ్మా.. బరువెక్కిన హృదయంతో రాస్తున్న.. మోదీకి చెప్పండి'
author img

By

Published : Jan 24, 2021, 9:54 PM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఓ రైతు మాత్రం చట్టాల రద్దు కోరుతూ ప్రధాని మోదీ తల్లికి లేఖ రాశారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తన కుమారుడికి చెప్పాలని కోరారు. ఈ మేరకు మోదీ తల్లి హీరాబెన్‌కు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్‌ సింగ్‌ అనే రైతు లేఖ రాశారు.

farmer writes a letter to pm modis mother on farm laws
రైతు రాసిన లేఖ

"అమ్మా.. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. ఈ దేశానికి, ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలు సాగు చట్టాల రద్దు కోరుతూ దిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కొందరు అనారోగ్యం పాలవగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తోటి రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధిస్తోంది. మీ కుమారుడైన ప్రధాని నరేంద్రమోదీకి ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పండి. ఎవరు చెప్పినా వినకపోవచ్చు గానీ, మీరు చెప్తే తప్పక వింటారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ఎంతో ఆశగా ఈ లేఖ రాస్తున్నా" అని హర్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో కిసాన్​ మార్చ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.