హరియాణాలో రైతులపై పెట్టిన కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని (formers protest news) రైతుసంఘాలు నిరవధిక నిరసనకు దిగాయి. హన్సీలోని మినీ సెక్రటేరియట్ ఎదుట.. ధర్నా చేపట్టాయి.
![formers protest in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13580412_imh1.jpg)
గత శుక్రవారం నార్నాండ్ పర్యటనకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్‌చందర్ జంగ్రా కారును కొంతమంది నిరసనకారులు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసులు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో రైతులపై పెట్టిన కేసులను (formers protest today) వెంటనే కొట్టి వేయాలని అన్నదాతలు నిరసనకు దిగారు. ఈ అంశంపై చర్చించేందుకు అధికారులు తమను పిలిచినప్పటికీ తమ డిమాండ్‌లకు సంబంధించి ఎటువంటి పరిష్కారం రాలేదని కర్షకులు తెలిపారు. తక్షణమే రైతులపై కేసులను ఎత్తివేసి, భాజపా ఎంపీ రామ్‌చందర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను నెరవేర్చే వరకు ధర్నా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
![formers protest in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13580412_img2.jpg)
మరోవైపు ఈ ఘటనలో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామని గతంలో రైతు సంఘాల నేతలు చెప్పారని ఖట్టర్ గుర్తుచేశారు. కానీ నార్నాండ్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.