ETV Bharat / bharat

హైదరాబాద్‌లో విషాదం - కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య - suicides in Hyderabad latest news

Family Suicide in Musheerabad
Family Suicide in Musheerabad
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 10:42 AM IST

Updated : Nov 17, 2023, 3:40 PM IST

10:38 November 17

ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో కుటుంబం ఆత్మహత్య

Family Suicide in Musheerabad : హైదరాబాద్ ముషీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం బలవన్మరణానికి (Family Suicide in Musheerabad) పాల్పడింది. నాలుగేళ్ల కుమార్తె తేజస్వినికి ఉరి వేసి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన సాయికృష్ణ, భార్య చిత్రకళ కుమార్తె తేజస్వితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారు గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Father and Two Daughters Suicide : పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణం!

Family suicide in Hyderabad Today : హైదరాబాద్‌ బిర్లా ప్లానిటోరియంలో చిత్రకళ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతితో పాటు కొందరు వేధింపులకు గురి చేస్తున్నట్లు ఇంట్లోని గోడలపై రాశారు. అదే విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు.. మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని గోడలపై రాసి ఉండటం చర్చనీయాశంగా మారింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి యజమాని, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఓసారి భార్యాభర్తలు ఇంటి నుంచి కిందికి వచ్చారు. ఆ తర్వాత తలుపులు వేసుకొని బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 12 గంటల సమయంలో కూడా టీవీ శబ్దం పెద్దగా రావడంతో చెప్పడానికి వెళ్లినా.. తలుపు తీయకపోవడంతో కిందకు వచ్చానని యజమాని వివరించారు. ఇవాళ ఉదయం సైతం టీవీ శబ్దం అలాగే వస్తుండటంతో పిలిచినా పలకకపోయేసరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు(Police Complaint) చేశానన్నారు.

Hyderabad Latest Crime News : ఆరు నెలల క్రితం సాయి కుటుంబం ఆ ఇంట్లో అద్దెకు దిగారు. కర్నూల్‌కు చెందిన సాయి, చిత్రకళ దంపతులు కొన్నేళ్లుగా నగరంలో నివాసం ఉంటున్నారు. వీళ్లకు 4 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. కుమార్తె తేజస్విని ఇంటికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. సాయి ర్యాపిడో బైక్ నడుపుతుండగా.. అతని భార్య చిత్రకళ బిర్లా ప్లానిటోరియంలో పని చేసేది. ఐదేళ్లుగా అందులో పని చేసిన చిత్రకళ.. ప్లానిటోరియం టికెట్లు అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో.. ఆమెను పిలిచి మందలించారు. దీంతో 25 రోజుల నుంచి విధులకు రావడం లేదని బిర్లా ప్లానిటోరియం పర్యవేక్షకురాలు గీత తెలిపారు.

Family Mass Suicide : ఒకే కుటుంబంలో ఏడుగురు సామూహిక ఆత్మహత్య.. ఆరుగురికి విషం ఇచ్చి.. ఆపై..

ఇంట్లో లభించిన సూసైడ్ నోట్‌లో అయితే బిర్లా ప్లానిటోరియంలో పని చేసే హరిబాబు, శ్యామ్ కొఠారి, గీత, సంతోశ్​రెడ్డి తమ చావుకు కారణమని రాసి ఉంది. వాళ్లు చేసిన అక్రమాలు బయటపడతాయనే తనను బలి చేశారని.. సూసైడ్ లేఖలో ఉంది. ఉద్యోగం నుంచి తీయలేదని.. విధులకు రమ్మని సమాచారం ఇచ్చినా, చిత్రకళ రాలేదని బిర్లా ప్లానిటోరియం(Birla Plantorium) ప్రతినిధులు గీతా, శ్యామ్ కొఠారి తెలిపారు. వాళ్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలున్నాయని.. కొన్నిసార్లు జీతం కూడా అడ్వాన్స్‌గా ఇచ్చామని వాళ్లు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిత్రకళ సోదరుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చిన తర్వాత శవపరీక్ష పూర్తి చేసి మృతదేహాలను అప్పగించనున్నారు.

Inter Student Suicide in Hyderabad : ''సారీ అమ్మానాన్న'.. ఇదే నా చివరి రోజు ఇక నేను వెళ్తున్నా..'

Selfie Suicide Viral Video : ఆర్థిక ఇబ్బందులు తాళలేక సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్

Last Updated : Nov 17, 2023, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.